Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. ఇంకా గుర్తించని 29 మృతదేహాలు.. మార్చురీలో అనాధలుగా..
ఈ మృతదేహాలను ఏం చేయాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వేలు నిర్ణయిస్తాయి. ఇందులో AIIMS భువనేశ్వర్‌కు ఎటువంటి జోక్యం లేదని చెప్పారు.. ఇది మృతదేహాలను భద్రపరచడానికి మాత్రమే కేటాయించబడింది అని AIIMS సిబ్బంది చెప్పారు. జార్ఖండ్‌కు చెందిన దినేష్ యాదవ్ (31), బీహార్‌కు చెందిన సురేష్ రే (23) మృతదేహాలను తీసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు విముఖత వ్యక్తం చేయడంతో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ జూలై 29న ఇద్దరు మృతదేహాలను దహనం చేసింది.
రెండు నెలల క్రితం ఒడిశాలోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, వారిలో 29 మంది మృతదేహాలు ఇంకా గుర్తింపు కోసం వేచి ఉన్నాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్‌లోని ఐదు కంటైనర్లలో భద్రపరచగా, మిగిలిన 266 మృతదేహాలను మృతుల బంధువులకు అప్పగించారు. ఎయిమ్స్ భువనేశ్వర్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ దిలీప్ కుమార్ పరిదా ఈ మేరకు వివరాలు వెల్లడించారు. జూన్ 2న జరిగిన ఈ ప్రమాదం తర్వాత, వివిధ ఆసుపత్రులు, ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి మొత్తం 162 మృతదేహాలను స్వీకరించామని, వాటిలో 81 మందిని వారి కుటుంబ సభ్యులకు అందించామని చెప్పారు. తీవ్రమైన గాయాలు, ఇతర సమస్యలు ఉన్నందున మిగిలిన 81 మృతదేహాలను మొదట గుర్తించలేమని పరిదా చెప్పారు.
DNA పరీక్ష ఫలితాల ఆధారంగా, మరో 52 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. 29మంది మృతదేహాలు ఇప్పటికీ గుర్తించలేదు. హక్కుదారుల డీఎన్‌ఏతో సరిపోలని మృతదేహాలను నిబంధనల ప్రకారం ఎవరికీ ఇవ్వబోమని చెప్పారు. ఈ మృతదేహాలను ఏం చేయాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వేలు నిర్ణయిస్తాయి. ఇందులో AIIMS భువనేశ్వర్‌కు ఎటువంటి జోక్యం లేదని చెప్పారు.. ఇది మృతదేహాలను భద్రపరచడానికి మాత్రమే కేటాయించబడింది అని పరిదా చెప్పారు.
జార్ఖండ్‌కు చెందిన దినేష్ యాదవ్ (31), బీహార్‌కు చెందిన సురేష్ రే (23) మృతదేహాలను తీసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు విముఖత వ్యక్తం చేయడంతో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ జూలై 29న ఇద్దరు మృతదేహాలను దహనం చేసింది.
జార్ఖండ్‌లోని దుమ్కా ప్రాంతానికి చెందిన హర్దేవ్ కుమార్ బంధువు కైలాష్ కుమార్ తన DNA నమూనాను సమర్పించిన తర్వాత అతని సోదరుడి మృతదేహం గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ, అతనికి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. డీఎన్‌ఏ నమూనా నివేదిక తర్వాత నా సోదరుడి మృతదేహాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నా.. చివరి వరకు వేచి ఉంటానని కైలాష్ కుమార్ తెలిపారు.
షాలిమార్ నుండి చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఒక స్టేషనరీ గూడ్స్ రైలు..ఒకే లైన్‌లో మూడు రైళ్లు ఢీ కొన్న ప్రమాదం 295 మంది ప్రాణాలు బలితీసుకుంది. జరిగిన ప్రమాదంలో 1200 మందికి పైగా గాయపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..