Viral: దేశం కాని దేశం వచ్చి.. మతి స్థిమితం కోల్పోయి.. 5 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి..
దర్గా సందర్శనకు బంగ్లాదేశ్‌నుంచి ఇండియాకు వచ్చిన ఓ మహిళ పాస్ పోర్ట్‌తోపాటు మతికోల్పోవడంతో చివరకు విశాఖపట్నంలోని మెంటల్ ఆస్పత్రికి చేరింది. అక్కడ వైద్యులు చికిత్సచేయడంతో మామూలు మనిషైన ఆమె అధికారుల సహాయంతో తిరిగి ఐదేళ్లతర్వాత తన స్వదేశానికి చేరింది. బంగ్లాదేశ్‌కు చెందిన అక్తర్ రహీమా అనే 35 ఏళ్ళ మహిళ 2019లో రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా సందర్శనకు వచ్చింది.
దర్గా సందర్శనకు బంగ్లాదేశ్‌నుంచి ఇండియాకు వచ్చిన ఓ మహిళ పాస్ పోర్ట్‌తోపాటు మతికోల్పోవడంతో చివరకు విశాఖపట్నంలోని మెంటల్ ఆస్పత్రికి చేరింది. అక్కడ వైద్యులు చికిత్సచేయడంతో మామూలు మనిషైన ఆమె అధికారుల సహాయంతో తిరిగి ఐదేళ్లతర్వాత తన స్వదేశానికి చేరింది. బంగ్లాదేశ్‌కు చెందిన అక్తర్ రహీమా అనే 35 ఏళ్ళ మహిళ 2019లో రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా సందర్శనకు వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో ఆమె మతిస్థిమితం కోల్పోయింది. దాంతో అటూ ఇటూ తిరుగుతూ సత్యవేడు శ్రీసిటీ పారిశ్రామిక వాడకు చేరుకుంది. మతి స్థిమితం కోల్పోయి రాష్ట్రాలు దాటుతూ చివరికి శ్రీసిటి పారిశ్రామిక వాడ లోని అప్పయ్య పాలెం గ్రామానికి చేరింది. అక్కడ దీనస్థితిలో తిరుగుతున్న ఆ మహిళను శ్రీసిటీ సెక్యూరిటీ చీఫ్ రమేష్ గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రహీమాను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ మానసిక వైద్యుల సలహా మేరకు విశాఖపట్నం ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ మూడేళ్లపాటు వైద్యం అందించారు వైద్యులు. ఆమె కోలుకోవడంతో వివరాలు తెలుసుకున్నారు పోలీసులు. విషయం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి బంగ్లాదేశ్ ఎంబసీ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. హైకమిషన్ అధికారులతో సంప్రదింపులు జరిపి, రహీమాను బంగ్లాదేశ్ సరిహద్దులోని హరిదాన్పూర్ వద్ద ఆ దేశ అధికారులకు అప్పగించారు. ఎట్టకేలకు రహీమ ఐదేళ్ల తర్వాత తన స్వదేశానికి చేరుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...