తల్లిదండ్రులు తస్మాత్‌ జాగ్రత్త..! మార్కెట్లో విచ్చలవిడిగా గంజాయి చాక్లెట్స్‌.. ఇద్దరి అరెస్ట్‌..

ఓ ఇంట్లో గంజాయి చాక్లెట్స్‌ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లలో సాగిస్తున్న గంజాయి చాక్లెట్స్‌ బిజినెస్‌ గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్‌ పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం మత్తు వ్యాపారంలో ఇంకా ఎవరెవరూ ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సోదాల్లో రూ. 30, రూ. 50, రూ.100 ఇలా అన్ని ధరలలో గంజాయి చాక్లెట్స్‌ తయారు చేశారు. సుమారు 6 గ్రాముల వరకు గంజాయి మిక్స్‌ చేసి చాక్లెట్ లాగా తయారు చేసి దుకాణాల్లో విక్రయిస్తున్నారు.

తల్లిదండ్రులు తస్మాత్‌ జాగ్రత్త..! మార్కెట్లో విచ్చలవిడిగా గంజాయి చాక్లెట్స్‌.. ఇద్దరి అరెస్ట్‌..
Ganja Chocolate
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 02, 2023 | 9:10 AM

తల్లిదండ్రులు తస్మాత్‌ జాగ్రత్త..! మీ పిల్లలు తినే చాక్లెట్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది. మీరు కాస్త బద్ధకంగా ఉండి, వారిని గమనించకుండా ఉంటే.. మీ పిల్లలు గంజాయి చాక్లెట్స్ తినే ప్రమాదం పొంచిఉంది. అవును! ఇప్పుడు మార్కెట్లో గంజాయి చాక్లెట్స్‌ విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి. రాయచూరులోని ఓ ఇంట్లో గంజాయి చాక్లెట్ గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లలో సాగిస్తున్న గంజాయి చాక్లెట్స్‌ బిజినెస్‌ గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్‌ పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం మత్తు వ్యాపారంలో ఇంకా ఎవరెవరూ ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల సోదాల్లో రూ. 30, రూ. 50, రూ.100 ఇలా అన్ని ధరలలో గంజాయి చాక్లెట్స్‌ తయారు చేసి విక్రయిస్తున్నారు. సుమారు 6 గ్రాముల వరకు గంజాయి మిక్స్‌ చేసి చాక్లెట్ లాగా తయారు చేసి దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తయారైన గంజాయి చాక్లెట్ రాయచూర్‌లోని ఎల్‌బిఎస్ నగర్, ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా రోజులుగా ఈ చాక్లెట్స్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు.

పోలీసుల సోదాల్లో రెండు బ్రాండ్ల పేరుతో ఉన్న మొత్తం 482 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. పట్టుబడిన వారి నుంచి కింగ్‌పిన్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించి సోదాలు చేపట్టారు. ప్రస్తుతం ఎక్సైజ్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గంజాయి అక్రమ వ్యాపారం వెనుక ఉన్న అసలు సూత్రదారుల కోసం వేట సాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..