Jayalalithaa’s Estate Mystery: తమిళనాడును షేక్ చేస్తున్న నయా కొడనాడు కాంట్రవర్సీ.. జయలలిత బంగాళా దోపిడి వెనుక మాజీ సీఎం ఉన్నారా..
Jayalalithaa's Kodanad Estate: జయ కొడనాడు ఎస్టేట్ లో జరిగిన మిస్టరీ ఏంటి.. కొడనాడు బంగాళాలో విలువైన సంపద ఉండేదా.. ఉంటే ఎవరు కొట్టేశారు.. డీఎంకే ప్రభుత్వం చేసిన విచారణలో సెన్సేషన్ నిజాలు బయటకొచ్చాయా.. మాజీ సీఎం బంగాళా దోపిడి వెనుక మరో మాజీ సీఎం ఉన్నారా.. తమిళనాట షేక్ చేస్తున్న నయా కొడనాడు కాంట్రవర్సీ ఏంటి.. జయలలిత పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పేరు కొడనాడు.. అప్పట్లో కొడనాడు ఎంత ఫెమాసో.. అయితే ఆ సంపద దోపిడీ వెనుక ఆ స్థాయి వ్యక్తుల పాత్ర ఉందా అన్న చర్చ ఇపుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.. ఇంకా ఎంత దుమారం రేగుతుందో చూడాలి..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మరణం ఓ మర్మం.. ఆ మరణం తర్వాత అలాంటి మర్మాలు అనేకం జరిగాయా.. జయ కొడనాడు ఎస్టేట్ లో జరిగిన మిస్టరీ ఏంటి.. కొడనాడు బంగాళాలో విలువైన సంపద ఉండేదా.. ఉంటే ఎవరు కొట్టేశారు.. డీఎంకే ప్రభుత్వం చేసిన విచారణలో సెన్సేషన్ నిజాలు బయటకొచ్చాయా.. మాజీ సీఎం బంగాళా దోపిడి వెనుక మరో మాజీ సీఎం ఉన్నారా.. తమిళనాట షేక్ చేస్తున్న నయా కొడనాడు కాంట్రవర్సీ ఏంటి.. జయలలిత పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పేరు కొడనాడు.. అప్పట్లో కొడనాడు ఎంత ప్రాచుర్యం ఉందో.. ఇపుడు అంత కాంట్రవర్సీ.. జయలలిత తమిళనాడు రాజధాని చెన్నై కంటే కొడనాడులొనే ఎక్కువగా ఉండేవారు. అది అప్పట్లో పెద్ద వివాదం కూడా.. ఇపుడు ఆ కొడనాడు వివాదం మరోమారు తెరపైకి వచ్చింది.
తమిళనాడు లోని నీలగిరి కొండల్లోని ఒక ప్రాంతమే కొడనాడు.. సుమారు 1200 ఎకరాల్లో ఉన్న టీ ఎస్టేట్ ప్రాంతం.. జయలలితకి చెందిన ఎస్టేట్‌గా గుర్తింపు పొందిన ఈ ఎస్టేట్ జయ మరణాంతరం ఎన్నో వివాదాలకి కేంద్రంగా మారింది.
జయలలితకు అత్యంత ఇష్టమైన కొడనాడు ఎస్టేట్..
అత్యాధునిక సదుపాయాలతో కొడనాడులో విలాసవంతమైన భవనం.. జయలలిత మరణం తర్వాత అప్పట్లో బంగాళాలో ఓ హత్య సంచలనంగా మారింది. వేలాది ఎకరాల్లో టీ ఎస్టేట్.. మధ్యలో బంగాళా.. జయలలిత మరణం తర్వాత మిస్టరీగా కొడనాడు ఎస్టేట్‌లో హత్యలు అప్పట్లో కలకలం సృష్టించాయి. 2017 ఏప్రిల్ లో ఎస్టేట్ వాచ్ మెన్ దారుణ హత్య.. అలాగే బంగాళాలో బారి చోరీ. తర్వాత రోజే జయలలిత మాజీ డ్రైవర్ హత్య.. ఇదంతా కేరళ మనోజ్ గ్యాంగ్ పనిగా గుర్తించారు పోలీసులు.
నీలగిరి కోర్టులో విచారణ జరుతుండగా..
డీఎంకే ప్రభుత్వం వచ్చాక..
ఇదే కేసులో చిన్నమ్మ శశికళ, మాజీ సీఎం ఎడపాడి పలనీ స్వామిలను కూడా విచారించింది సిట్ బృందం. కేరళ గ్యాంగ్ లోని నిందితులను విచారణ జరిపిన అనంతరం మాజీ సీఎం పలనీ స్వామిని విచారణ జరపడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడును షేక్ చేస్తున్న తాజా పరిణామాలు..
జయలలిత మరణం తర్వాత కొడనాడు ఎస్టేట్ లో జరిగిన చోరీ దోపిడీ ముఠా పని కాదని సిట్ విచారణలో తెలింది.. కానీ విచారణలోని నిజాలను అధికారులు ఎక్కడా బయట పెట్టలేదు.. దోపిడీ వెనుక పెద్దహస్తం ఉందన్న అనుమానం కోణంలో విచారణ జరిపారు.. అనుకున్నట్టే షాకింగ్ విషయం బయటకు వచ్జినట్లు ఎడీఎంకే లోని ఓ వర్గం భావిస్తోంది.. మాజీ సీఎం ఈపీఎస్ కు మరో మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం (ఓపిఎస్) కు అస్సలు పడదన్న విషయం తెలిసిందే.. అలాగే ఓపిఎస్ కు చిన్నమ్మ శశికళ మేనల్లుడు AAMMK అధ్యక్షుడు టీటీవీ దినకరన్ కు కూడా అస్సలు సెట్ అయ్యేది కాదు.. కానీ ఇప్పుడు ఇద్దరూ ఒక్కటయ్యారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు.. అది కూడా ఒకే వేదికపై ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతున్నారు..
జయ మరణం, కొడనాడు మిస్టరీ విషయాలపై విచారణ జరుపుతామని మ్యానిఫెస్టోలో పెట్టిన డీఎంకే ఇపుడు ఎందుకు స్లో అయ్యిందని ప్రశ్నిస్తున్నారు.. విచారణలో విషయాలను బయట పెడితే పలనీ స్వామి పాత్ర బయటకు వస్తుందని బలంగా నమ్ముతున్నారు టీటివి, ఓపిఎస్.. దీంతో కొడనాడు ఎస్టేట్ కేంద్రంగా ఇంత మాస్టర్ ప్లాన్ నడిచిందా అన్న డిస్కషన్ జరుగుతోంది.. అంటే జయ కొడనాడు బంగాళాలో ఎంత సంపద ఉండేది.. వేల కోట్ల సంపద అక్కడ ఉండేది అని అప్పట్లో విపక్షాలు అంటుండేవి.. అయితే ఆ సంపద దోపిడీ వెనుక ఆ స్థాయి వ్యక్తుల పాత్ర ఉందా అన్న చర్చ ఇపుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.. ఇంకా ఎంత దుమారం రేగుతుందో చూడాలి..
మరిన్ని జాతీయ వార్తల కోసం