Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ఒక టీచర్ అని మీకు తెలుసా? ఆమె జీతం ఎంతో తెలుసా? ఎవరికీ తెలియని విశేషాలు మీకోసం..
తల్లి, సోదరుడితో కలిసి కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె దేశ వ్యాప్తంగా పర్యటనలు సాగిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా.. ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఆమె వాక్చాతుర్యం, ఆమె రాజకీయ వ్యూహాలు, ప్రచార శైలి అన్నీ విభిన్నమే. అందుకే, ఆమె గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రస్ట్ చూపుతారు. గాంధీ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్న తనంలో ఏం చేసేవారు? ఉన్నత చదువులు ఏమైనా చదివారా? చదివితే ఏం చదివారు?..
Priyanka Gandhi Biography: ప్రియాంక గాంధీ.. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు. రాజీవ్ గాంధీ-సోనియా గాంధీ కూతురిగా, అంతకు మించి తన నానమ్మ ఇందిరా గాంధీ పోలికలతో అందరినీ ఆకట్టుకుంటున్న ప్రియాంక గాంధీ వాద్రా జాతీయ రాజకీయాల్లోనే కాకుండా, దేశ వ్యాప్తంగా ప్రధాన వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హవాతో కాంగ్రెస్ పని ఖతమైందని అనుకుంటున్న తరుణంతో.. తనదైన శైలిలో పార్టీకి పునరుజ్జీవం పోస్తున్నారు ప్రియాంక గాంధీ. తల్లి, సోదరుడితో కలిసి కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె దేశ వ్యాప్తంగా పర్యటనలు సాగిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా.. ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఆమె వాక్చాతుర్యం, ఆమె రాజకీయ వ్యూహాలు, ప్రచార శైలి అన్నీ విభిన్నమే. అందుకే, ఆమె గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రస్ట్ చూపుతారు. గాంధీ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్న తనంలో ఏం చేసేవారు? ఉన్నత చదువులు ఏమైనా చదివారా? చదివితే ఏం చదివారు? ఉద్యోగం ఏమైనా చేశారా? చేస్తే ఆమె తొలి జీతం ఎంత? అసలు ఆమె బాల్యం నుంచి ఇప్పటి వరకు జీవితం ఎలా సాగింది.. ఇలాంటి ఇంట్రస్టింగ్ అంశాల గురించి ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రియాంక గాంధీ చిన్ననాటి విశేషాలు..
భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ దంపతుల గారాలపట్టి అయిన ప్రియాంక గాంధీ ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో జనవరి 12, 1972లో జన్మించారు. ఆమె కంటే ముందు రాహుల్ గాంధీ జన్మించారు. ప్రియాంక గాంధీ మొదట అంటే 1984 వరకు డెహ్రాడూన్‌లోని వెల్హామ్ గర్ల్స్ స్కూల్‌లో చదివారు. ఆ తరువాత భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్, ప్రియాంక ఇద్దరినీ సౌత్ ఢిల్లీలోని డే స్కూల్‌లో చేర్పించారు. ఇక ఇందిరా గాంధీ హత్య తరువాత కొంతకాలం ఇంట్లోనే ఉండి చదువుకోగా.. ఆ తరువాత జీసస్ అండ్ మేరీ కాలేజీ, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో గ్రాడ్యూయేషన్ పొందారు ప్రియాంక.
ప్రియాంక గాంధీకి సైకాలజీపై మక్కువ ఎక్కువ. ముఖ్యంగా చిన్న పిల్లలను అధ్యయనం చేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే ఆమె చైల్డ్ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యూయేషన్ చేయాలనుకున్నారు. అంతకు ముందు.. సౌత్ ఢిల్లీలోని ఓ నర్సరీ స్కూల్‌లో చిన్న పిల్లలకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌లో శిక్షణ ఇచ్చారు. ఇక ఆమె అప్పటికే క్లాస్ 16 కు సంబంధించిన రెండు స్కిట్‌లకు డైరెక్షన్ కూడా చేశారు. అప్పటికి ప్రియాంక గాంధీ వయసు 21 ఏళ్లు. ఇక ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్‌గా(1993లో) ప్రియాంక గాంధీ రూ. 1,200 జీతం తీసుకుందని సమాచారం. అంతేకాదండోయ్.. ప్రియాంక గాంధీ రేడియో ఆపరేటర్‌గానూ పని చేశారు.
ఆ తరువాత ఢిల్లీకి చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ రాబర్ట్ వాద్రాతో ఫిబ్రవరి 18, 1997లో ప్రియాంక గాంధీ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఇలా కుటుంబ వ్యవహారాలను చూసుకుంటూనే.. ఇటు తన తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీకి రాజకీయ పరంగా సహయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. రాజకీయాల్లోకి రానప్పటికీ.. ప్రజలకు వీలైనంత వరకు సేవ చేస్తానంటూ ప్రకటించిన ప్రియాంక గాంధీ.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రతినిధులైన రాయ్ బరేల్, అమేథీ నియోజకవర్గాలను తరచూ సందర్శిస్తుంటారు. అక్కడి ప్రజలకు అండదండగా ఉంటారు. అయితే, 2014 తరువాత పరిస్థితుల నేపథ్యంలో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడంతోనే తన మార్క్ స్పీచ్‌తో ఎన్డీయే పాలకులపై వాక్భాణాలు సంధిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంలో ఆమె కూడా కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆమె నాయకత్వంపై బలమైన సంకేతాలు వస్తున్నాయి. తదుపరి జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక గాంధీ నిలబడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎన్నికల బరిలో నిలిస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..