Manipur Violence: మణిపుర్ నుంచి ఇద్దరు మహిళల్ని రాజ్యసభకు నామినేట్ చేయండి.. ప్రెసిడెంట్ ముర్ముని కోరిన ఇండియా కూటమి
మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన సోషల్ మీడయాలో వైరలవ్వడంతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్‌లో జరుగుతున్న వర్షకాల సమావేశంలో కూడా మణిపుర్ అంశాన్ని విపక్ష పార్టీలు లెవనెత్తడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. మణిపుర్ అంశంపై ప్రధాని మాట్లాడాలని విపక్ష కూటమి అయిన ఇండియా డిమాండ్ చేసింది.

మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన సోషల్ మీడయాలో వైరలవ్వడంతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్‌లో జరుగుతున్న వర్షకాల సమావేశంలో కూడా మణిపుర్ అంశాన్ని విపక్ష పార్టీలు లెవనెత్తడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. మణిపుర్ అంశంపై ప్రధాని మాట్లాడాలని విపక్ష కూటమి అయిన ఇండియా డిమాండ్ చేసింది. అమిత్ షా మాట్లాడుతారని బీజేపీ పార్టీ చెప్పినప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ఈ అంశంపై ఆగస్టు 10 ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఆయన ఏం మాట్లడనున్నారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఇండియా కూటమి సభ్యులు మరో నిర్ణయం తీసుకున్నారు. మణిపుర్ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు.
ఇలా చేయడం వల్ల మహిళలపై జరుగుతున్న దాడులను సరిదిద్దేందుకు సహాయపడుతుందని వారు భావించారు. ఇటీవల మణిపుర్ పర్యటనకు వెళ్లొచ్చిన 21 మంది ఇండియా కూటమి సభ్యులు బుధవారం రోజున రాష్ట్రపతి ముర్మును కలిశారు. ప్రస్తుతం మణిపుర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనల సమస్యలు పరిష్కరించాలని ఇందుకోసం చొరవ తీసుకోవాలని ఆమెను కోరారు. అలాగే మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్లపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని అడగాలని కోరారు. మణిపుర్‌లో వేరు వేరు వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలను రాజ్యసభ్యకు నామినేట్ చేయాలని రాష్ట్రపతికి సూచించామని.. ఈ చర్య మణిపుర్‌లో జరుగుతున్న అఘాయిత్యాలను సరిదిద్దేందుకు వీలుగా ఉంటుందని తృణముల్ కాంగ్రెస్ సభ్యురాలు సుస్మితా దేవ్ తెలిపారు. ఇక రాష్ట్రపతిని కలిసిన వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గె, ఎన్సీపీ అధికనేత పవార్ తదితరులు ఉన్నారు.




