Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

68వ అంతస్తు నుండి పడి వ్యక్తి మృతి.. అతడు అల్లాటప్ప వ్యక్తి కాదు.. డేర్‌డెవిల్..

40వ అంతస్తులో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చానని సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు. 68వ అంతస్తు నుంచి ఫోటో తీయడానికి ప్రయత్నిస్తుండగా రెమీ కుప్పకూలిపోయాడు. అయితే 40వ అంతస్తులో అతని స్నేహితుడు అయిన వ్యక్తికి రెమి లూసిడి గురించి అస్సలు తెలియదని చెప్పారు. సెక్యూరిటీ గార్డులు ప్రశ్నించకుండా ఉండేందుకు రెమీ అబద్ధం చెప్పినట్టుగా ఆ తర్వాత తెలిసింది.  బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, 49వ అంతస్తులో ఉన్న లిఫ్టు నుంచి బయటకు వచ్చిన రెమీ సమీపంలోని

68వ అంతస్తు నుండి పడి వ్యక్తి మృతి.. అతడు అల్లాటప్ప వ్యక్తి కాదు.. డేర్‌డెవిల్..
French Daredevil Remy F
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 02, 2023 | 11:16 AM

ఆకాశహర్మ్యాలను అధిరోహిస్తూ వీడియోలు తీసే ఫ్రెంచ్ డేర్‌డెవిల్ రెమీ లూసిడి అనేక అద్భుతాలు సృష్టించాడు. 30 ఏళ్ల రెమి లూసిడి అత్యంత కష్టం, భయంకరంమైన స్టంట్స్‌ని కూడా ఎంతో సరదాగా చేసేస్తుంటాడు. ప్రాణాలను పణంగా పెట్టి.. ప్రమాదకరంగా ఉన్న భవనాలను ఇట్టే ఎక్కేస్తుంటాడు.. అంతేకాదు.. ఇలాంటి స్టంట్స్‌ చేసేటప్పుడు వీడియోలు, ఫోటోలను తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేవాడు. ఎత్తైన భవన విన్యాసాలకు పేరుగాంచిన రెమీ లూసిడి, హాంగ్‌కాంగ్‌లో ఓ అద్భుత సాహసం చేసే క్రమంలో 68వ అంతస్తు నుండి సుమారు 721 అడుగుల కిందకు పడిపోయి చనిపోయాడు. హాంకాంగ్‌లోని ఆకాశహర్మ్యాన్ని అధిరోహిస్తూ రెమీ లూసిడి కిందపడి మరణించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. హాంకాంగ్‌లోని టవర్ కాంప్లెక్స్ ఎక్కుతుండగా ఈ విషాదం సంభవించింది. సంఘటనా స్థలంలో మృతదేహంతో పాటు స్పోర్ట్స్ కెమెరా కూడా లభ్యమైంది. అతను చేస్తున్న ప్రమాదకరమైన క్రీడల గురించిన సమాచారం ఉందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.

రెమీ లూసిడి ఘటనా స్థలంలోనే మరణించినట్లు ప్రకటించారు. అసంపూర్తిగా ఉన్న పై అంతస్తులో ఉన్న పెంట్ హౌస్ కు చేరుకున్న రెమీ లూసిడి అక్కడ ఇరుక్కుపోయాడు.. వెంటనే కిటీకిని బలంగా తన్నిఆ ఇంట్లోని వారిని పిలిచాడు. అయితే, లోపల ఉన్న వ్యక్తి సహాయం చేయడానికి బయటకు వచ్చేలోపే అతడు కిందకు పడిపోయాడు. ఈ సంఘటన గత గురువారం జరిగింది. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో అతడు హాంకాంగ్‌ లోని ది ట్రెగంటెర్‌ టవర్‌ కాంప్లెక్స్‌ను ఎక్కేందుకు ప్రయత్నించాడు.  40వ అంతస్తులో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చానని సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు. 68వ అంతస్తు నుంచి ఫోటో తీయడానికి ప్రయత్నిస్తుండగా రెమీ కుప్పకూలిపోయాడు.

ఇవి కూడా చదవండి

అయితే 40వ అంతస్తులో అతని స్నేహితుడు అయిన వ్యక్తికి రెమి లూసిడి గురించి అస్సలు తెలియదని చెప్పారు. సెక్యూరిటీ గార్డులు ప్రశ్నించకుండా ఉండేందుకు రెమీ అబద్ధం చెప్పినట్టుగా ఆ తర్వాత తెలిసింది.  బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, 49వ అంతస్తులో ఉన్న లిఫ్టు నుంచి బయటకు వచ్చిన రెమీ సమీపంలోని 68వ అంతస్తుకు మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించినట్టుగా వీడియోలో కనిపించింది. అతని మరణానికి ముందు రెమీ లూసిడి చివరి Instagram పోస్ట్ వైరల్‌గా మారింది.

రెమీ లూసిడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 3 వేలకు పైగా అనుచరులు ఉన్నారు మరియు అతని ఫోటో వీడియోలన్నీ అలాంటి సాహసానికి సంబంధించినవి. ప్రపంచంలోని అనేక ఆకాశహర్మ్యాలు, క్రేన్‌లు, ఎలక్ట్రికల్ ట్రాన్స్‌మిటర్ టవర్లు, రేడియో టవర్లను అధిరోహించినందుకు రెమీ లూసిడి రికార్డును కలిగి ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..