AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna : ఇన్నాళ్లు మౌనంగానే ఉన్నాను.. ఇకపై సహించేది లేదు.. రూమర్స్ పై రష్మిక రియాక్షన్..

నా మాటలను వక్రీకరించడం, నేను అసలు అనని మాటలను అన్నట్టుగా కల్పించి తప్పుడు కథనాలు అల్లడం నేను చూస్తూనే ఉన్నాను. కేవలం వ్యూస్, రీచ్, ఎంగేజ్‌మెంట్ కోసం నాపై ద్వేషాన్ని పెంచుతూనే ఉన్నారు. ఇదంతా నాకు ఎంతో బాధ కలిగించినా, నేను మౌనంగా, ఓపికగా భరించాను. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి అన్యాయమైన విమర్శలు సహజమే అని సరిపెట్టుకున్నాను.

Rashmika Mandanna : ఇన్నాళ్లు మౌనంగానే ఉన్నాను.. ఇకపై సహించేది లేదు.. రూమర్స్ పై రష్మిక రియాక్షన్..
Rashmika Mandanna
Praveen Vadla
| Edited By: |

Updated on: Mar 12, 2026 | 5:28 PM

Share

ఇప్పటివరకు నా ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నా ఆత్మీయులకు, అలాగే ఈ విషయంతో సంబంధం ఉన్న ఇతరుల కోసం ఇది రాస్తున్నాను… గత ఎనిమిదేళ్లుగా ఆన్‌లైన్‌లో కొందరు వ్యక్తులు, అలాగే మీడియాలోని ఒక వర్గం నాపై తప్పుడు ప్రచారం, వేధింపులు, ఉద్దేశపూర్వక దాడులకు పాల్పడుతున్నారు. నా మాటలను వక్రీకరించడం, నేను అసలు అనని మాటలను అన్నట్టుగా కల్పించి తప్పుడు కథనాలు అల్లడం నేను చూస్తూనే ఉన్నాను. కేవలం వ్యూస్, రీచ్, ఎంగేజ్‌మెంట్ కోసం నాపై ద్వేషాన్ని పెంచుతూనే ఉన్నారు. ఇదంతా నాకు ఎంతో బాధ కలిగించినా, నేను మౌనంగా, ఓపికగా భరించాను. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి అన్యాయమైన విమర్శలు సహజమే అని సరిపెట్టుకున్నాను.

ఎక్కువమంది చదివినవి : Dil Raju: హీరోయిన్‏కు కళ్లు లేవని ఎవరు కొనలేదు.. నేను తీసుకుని రిలీజ్ చేశా.. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. దిల్ రాజు..

నేను నిజాయితీగా, సంతోషంగా ఉంటూ నా చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని పంచుతున్నంత కాలం అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయని నమ్మాను. కానీ గత 24 గంటల్లో జరిగిన పరిణామాలు శృతి మించాయి. ఇక వీటిని చూసీచూడనట్లు వదిలేయలేను. సుమారు ఎనిమిదేళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న ఒక ప్రైవేట్ ఆడియో సంభాషణను.. అందులో ఉన్నవారికి తెలియకుండా, వాళ్ళ అనుమతి లేకుండా రికార్డ్ చేసి లీక్ చేశారు. అందులో ఒక చిన్న భాగాన్ని మాత్రం కావాలనే సందర్భం లేకుండా కట్ చేసి, నా వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న తాజా పరిణామాలకు ముడిపెడుతూ.. ఉద్దేశపూర్వకంగా ఈ వివాదాన్ని సృష్టించి వైరల్ చేస్తున్నారు. మనుషులు ఇంతలా ఎలా దిగజారుతారు..?

ఇలా చేస్తూ, ఇందులో ఏమాత్రం సంబంధం లేని నా కుటుంబాన్ని, నేను స్నేహపూర్వకంగా మెలిగే వ్యక్తులను కూడా ఈ వివాదంలోకి లాగి ఇబ్బంది పెడుతున్నారు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే కాకుండా, నా పరువుకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడమే అవుతుంది. జీవితంలో మనం ముందుకు సాగుతూ, ఎదుగుతూ, మంచి పనులు చేస్తూ పాజిటివిటీని పంచుతుంటే.. కొందరు మాత్రం ఇలా ఎదుటివారి ఆత్మగౌరవాన్ని, ప్రశాంతతను దెబ్బతీస్తూ ద్వేషాన్ని, వివాదాలను సృష్టిస్తుండటం చాలా దురదృష్టకరం. ఎనిమిదేళ్లుగా ఈ దాడులు నా వరకే పరిమితం అయినప్పుడు నేను మౌనంగా ఉన్నాను. కానీ ఈరోజు ఈ బురద ఇతరుల మీద కూడా పడుతున్నప్పుడు నేను ఇక ఎంతమాత్రం మౌనంగా ఉండలేను.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్స్.. ఇండస్ట్రీనే అల్లాడించిన గ్లామరస్ బ్యూటీ.. క్యాన్సర్‏ను జయించి ఇలా..

దీనికి ఒక హద్దు గీయాలని నిర్ణయించుకున్నాను. ఈ లీకైన కంటెంట్‌ను లేదా దీనికి సంబంధించిన తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లు, వ్యక్తులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. వాటిని వెంటనే తొలగించండి. ఈ ప్రకటన వెలువడినప్పటి నుండి మీకు 24 గంటల సమయం ఇస్తున్నాను. అలా చేయని పక్షంలో, నా పరువుకు భంగం కలిగించే లేదా నా ప్రైవసీని దెబ్బతీసే ఈ కంటెంట్‌ను ఇకపైనా ప్రచారం చేసే వ్యక్తులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా మీడియా సంస్థలపై రేపటి నుండి చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తాను. చట్టప్రకారం వారికి లీగల్ నోటీసులు పంపుతాను. ఈ నిర్ణయం ఆషామాషీగా తీసుకున్నది కాదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పనిసరి అయింది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

ఎక్కువమంది చదివినవి : Cinema : అరె ఏంట్రా ఇది.. 15 ఏళ్లైనా నాగార్జున సినిమాకు తగ్గని డిమాండ్.. ఇప్పుడు ఓటీటీని అల్లాడిస్తోన్న మూవీ..

Follow Us