Slab Curing Mistakes: ఇంటి స్లాబ్ క్యూరింగ్‌లో ఈ ఒక్క తప్పు చేయకండి.. ఎన్ని రోజులు క్యూరింగ్ చేయాలి?
Slab Curing Mistakes: సరైన క్యూరింగ్ పగుళ్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వాతావరణ పరిస్థితులు, ఉపయోగించిన సిమెంట్ రకం ఆధారంగా క్యూరింగ్ సమయాన్ని, పద్ధతిని ఎంచుకోవడం ముఖ్యం. కన్‌స్ట్రక్షన్స్ సంస్థలు నాణ్యమైన నిర్మాణానికి కట్టుబడి, కనీసం 21 రోజుల పాటు క్యూరింగ్‌ను..

Slab Curing Mistakes: ఇంటి నిర్మాణం అనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఇంటిని నిర్మించేటప్పుడు చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ చిన్న చిన్న తప్పులే పెద్ద నష్టాన్ని తీసుకువస్తాయి. అందుకే ఇంటి నిర్మాణంలో అనుభం ఉన్నవారితో ఇల్లు కట్టించుకోడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. మంచి బిల్డర్స్ ఉండాలి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర నష్టాన్ని అనుభవించాల్సి ఉంఉంది. ఇంటి నిర్మాణంలో ముఖ్యంగా స్లాబ్ విషయంలో నాణ్యమైన సిమెంట్, స్టీల్ ఎంత ముఖ్యమో, సరైన క్యూరింగ్ కూడా అంతే ప్రాధాన్యత వహిస్తుంది. చాలా మంది కేవలం స్లాబ్ వేసిన తర్వాత నీళ్లు పోసి సరిపోయిందని అనుకుంటారు. కానీ, అది సరైన క్యూరింగ్ కాదు. స్లాబ్ క్యూరింగ్‌లో చేయకూడని ప్రధాన పొరపాటు ఇదే.
అసలైన క్యూరింగ్ అంటే కాంక్రీట్‌కు నిరంతరం తేమ అందేలా చూడడం. స్లాబ్‌పై కట్టలు కట్టి నీళ్లు నిల్వ ఉండేలా చూసుకోవడం దీనికి సరైన మార్గం. నిరంతర తేమ అందుబాటులో ఉండటం వల్ల సిమెంట్ హైడ్రేషన్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. ఈ ప్రక్రియ కాంక్రీట్ బలాన్ని పెంచడానికి, దాని మన్నికను పెంపొందించడానికి అత్యవసరం.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి ‘PAANI’ యాప్
సరైన క్యూరింగ్ పగుళ్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వాతావరణ పరిస్థితులు, ఉపయోగించిన సిమెంట్ రకం ఆధారంగా క్యూరింగ్ సమయాన్ని, పద్ధతిని ఎంచుకోవడం ముఖ్యం. కన్‌స్ట్రక్షన్స్ సంస్థలు నాణ్యమైన నిర్మాణానికి కట్టుబడి, కనీసం 21 రోజుల పాటు క్యూరింగ్‌ను లక్ష్యంగా పెట్టుకుంటాయి. కానీ 21 రోజుల క్యూరింగ్ అనే నియమం లేదు. ఇక్కడ గుర్తించుకోవల్సిన విషయం ఏంటంటే మంచి క్యూరింగ్ అనేది నాణ్యమైన, దీర్ఘకాలం నిలిచే నిర్మాణానికి పునాది. మీ ఇంటి నిర్మాణానికి సరైన క్యూరింగ్ లేకుంటే తీవ్రంగా నష్టపోతారనే విషయాన్ని గుర్తించుకోండి.
ఇది కూడా చదవండి: Immersion Rod or Geyser: గీజర్ vs ఇమ్మర్షన్ రాడ్.. దేనితో కరెంట్ బిల్లు ఎక్కువ? ఏది వాడితే డబ్బు ఆదా అవుతుందో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




