AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సిక్స్ కూడా కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో బెన్ డకెట్ అరుదైన cc

Ben Duckett 167 Runs: ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett) శ్రీలంకతో వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో 132 బంతుల్లో 167 పరుగులు చేసిన డకెట్.. ఒక్క సిక్స్ కూడా కొట్టకుండా ఈ భారీ స్కోరు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Venkata Chari
|

Updated on: Oct 29, 2026 | 9:53 PM

Share
Ben Duckett 167 Runs: శ్రీలంక బౌలర్లపై బెన్ డకెట్ ఆరంభం నుంచే ఆధిపత్యం చూపించాడు. గద్దాఫీ స్టేడియంలో 132 బంతులు ఎదుర్కొని ఏకంగా 167 పరుగులు చేశాడు. భారీ సిక్సర్లపై ఆధారపడకుండా బౌండరీలతోనే పరుగుల వరద పారించాడు.

1 / 5
డకెట్ ఇన్నింగ్స్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఇదే. అతని బ్యాట్ నుంచి 24 ఫోర్లు వచ్చాయి. అయితే ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు. సిక్స్ లేకుండానే 167 పరుగులు సాధించిన ఇంగ్లండ్ ఆటగాడిగా డకెట్ ప్రత్యేక రికార్డు సృష్టించాడు.

2 / 5
సిక్సర్ లేకుండా భారీ వన్డే స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బెన్ డకెట్ తన స్థానాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. ఈ జాబితాలో ఆండ్రూ స్ట్రాస్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, హషీమ్ ఆమ్లా వంటి దిగ్గజాలు ఉన్నారు. అయితే సిక్స్ లేకుండా అత్యధిక వన్డే స్కోరు రికార్డు మాత్రం 2016లో 173 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ పేరిట ఉంది.

3 / 5
లాహోర్‌లో బెన్ డకెట్‌కు ప్రత్యేకమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడిన అతను ఏకంగా మూడు సెంచరీలు సాధించాడు. దీంతో లాహోర్‌లో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు.

4 / 5
బెన్ డకెట్ వన్డే కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ. ఇందులో మూడు శతకాలు లాహోర్ గద్దాఫీ స్టేడియంలోనే రావడం విశేషం. అంతేకాదు, ఈ సిరీస్‌లో అతను వరుసగా రెండో సెంచరీ సాధించాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో డకెట్ కీలక ఆటగాడిగా మరోసారి తన సత్తా చాటాడు.

5 / 5
Follow Us
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!

ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..

తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..

'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. వీడియో

12 జట్లు.. 6 ఓవర్లు.. 5 బౌలర్లు.. 31 పరుగులు చేస్తే రిటైర్

 అరటి తొక్కలు పారేయకండి.. ఇలా వాడితే మీ మొక్క గుత్తులుగా పూలు

భారత్, పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ పోరు.. ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

ఈ రెండింటిలో దేనితో కరెంట్‌ బిల్లు ఎక్కువ? ఏది బెస్ట్..!

కేటీఆర్‌కు కొండా సురేఖ ఇప్పుడెందుకు సారీ చెప్పారు..?

 భుజాలపై తెల్లటి పొలుసులు కనిపిస్తున్నాయా? చుండ్రుకు దీంతో చెక్