నెట్టింట రెచ్చిపోయిన సీరియల్ బ్యూటీ.. గ్లామర్ ఫోజులతో అరాచకం..

Rajitha Chanti

Pic credit - Instagram

28 October 2026

బుల్లితెరపై ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో ‘జగతి మేడమ్‌’గా తెలుగు ప్రేక్షకులలో విశేష ప్రజాదరణ పొందిన కన్నడ నటి జ్యోతి రాయ్.

ఇటీవల దర్శకుడు సుక్కూ పూర్వాజ్‌ను వివాహం చేసుకుని ఇప్పుడు కథానాయికగా ఆమె టాలీవుడ్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

ప్రస్తుతం తన భర్త దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’లో ఆమె ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్లలో జ్యోతి పూర్వాజ్ కొన్ని బోల్డ్, రొమాంటిక్ సీన్లలో కనిపించింది. 

భర్త దర్శకత్వంలోనే, ఆయన ముందే ఇతర నటులతో ఇలాంటి బోల్డ్ సీన్లలో ఎలా నటించగలిగారంటూ నెటిజన్లు రకరకాల ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ వివాదంపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జ్యోతి పూర్వాజ్ చాలా స్పష్టంగా స్పందించారు. అంతేకాదు తనదైన స్టైల్లో కౌంటరిచ్చారు జ్యోతి.

ఒక నటిగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు తన శరీరంపై కంటే పాత్రపైనే పూర్తి నియంత్రణ , శ్రద్ధ ఉంటుందని ఆమె తెలిపారు.

మనం డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు వారిని కేవలం డాక్టర్‌గానే చూస్తాం గానీ, స్త్రీ లేదా పురుషుడు అని చూడము. నటన కూడా అంతే అని చెప్పుకొచ్చారు.