AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంటి సినిమాకు వెంకటేష్‌ను తీసుకోవడంతో ఆ హీరో బాదపడ్డారా.? అసలు ఆయన చేయాల్సిన మూవీనా.!

వెంకటేష్ కెరీర్ మొదలైనప్పటి నుంచి ఆయన ఒక్క జానర్‌కే పరిమితం కాకుండా ప్రయోగాలు చేశారు. ఇది ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది.’ప్రేమ’, ‘సుందరకాండ’, ‘చంటి’, ‘పవిత్ర బంధం’, ‘సూర్యవంశం’ వంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు ‘ఫ్యామిలీ హీరో’గా స్థిరపడ్డారు. ముఖ్యంగా, ‘ప్రేమ’ సినిమా వచ్చిన ‘విక్టరీ’ టైటిల్ ఆయన పేరుకు శాశ్వతంగా చేరిపోయింది.

చంటి సినిమాకు వెంకటేష్‌ను తీసుకోవడంతో ఆ హీరో బాదపడ్డారా.? అసలు ఆయన చేయాల్సిన మూవీనా.!
Venkatsh
Rajeev Rayala
|

Updated on: Oct 30, 2026 | 8:29 AM

Share

తెలుగు సినీ చరిత్రలో చంటి చిత్రం ఒక అపురూపమైన విజయంగా నిలిచింది. వెంకటేష్ కెరీర్‌కు ఒక మలుపునిచ్చిన ఈ చిత్రం, మరో నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు మాత్రం ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిందట. ఈ చిత్రం వెంకటేష్ చేతికి ఎలా వచ్చింది అనే దాని పై సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. చంటి చిత్రం 1991లో విడుదలైన తమిళ బ్లాక్‌బస్టర్ చిన్న తంబికి రీమేక్. తమిళంలో పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఆయన్ని ఎంతగానో ఆకట్టుకుందని, పది రోజులు ఒక భూస్వామి ఇంట్లో చిత్రీకరణ జరుపుతున్నప్పుడు, ఆ ఇంట్లో ఏ మహిళ కూడా పది రోజులు కనిపించకపోవడం నుంచి ఈ కథకు ప్రేరణ పొందినట్లు చెబుతారు. డి. రామానాయుడు చిన్న తంబిని చూసి వెంకటేష్‌కి సరిపోదని భావించినప్పటికీ, కే.ఎస్. రామారావుకు ఈ చిత్రం బాగా నచ్చిందట. అప్పటికే రాజేంద్ర ప్రసాద్‌తో పుణ్యస్త్రీ, ముత్యమంత ముద్దు వంటి చిత్రాలు నిర్మించిన కే.ఎస్. రామారావు, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్‌ను హీరోగా, ఖుష్బూను కథానాయికగా చిన్న తంబి రీమేక్ చేయాలని ప్రణాళికలు రచించారట. పి. వాసు, కే.ఎస్. రామారావుల మధ్య ఉన్న స్నేహంతో తెలుగు హక్కులు సులభంగా లభించాయి. రాజేంద్ర ప్రసాద్, ఖుష్బూ కాంబినేషన్‌లో సినిమా అని అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది.

ఈ దశలో, చిన్న తంబి సినిమాను చూసిన వెంకటేష్, ఆ పాత్రకు తాను సరైన ఎంపిక అని భావించారట. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో యార్లగడ్డ సురేంద్ర నిర్మించాల్సిన వెంకటేష్ చిత్రం ఉన్నందున, చంటి ప్రాజెక్ట్ తనకే ఇవ్వాలని పట్టుబట్టారట. దీంతో, రాజేంద్ర ప్రసాద్‌ను తప్పించి వెంకటేష్‌ను కథానాయకుడిగా ఎంపిక చేశారట. ఇది రాజేంద్ర ప్రసాద్‌ను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. తన జీవితంలో ఆహా నా పెళ్లంట వంటి విజయవంతమైన చిత్రాన్ని ఇచ్చిన డి. రామానాయుడు, తన కుమారుడు వెంకటేష్ కోసం ఈ మార్పును అంగీకరించడంతో రాజేంద్రప్రసాద్ బాదపడ్డారట. బహిరంగంగా ఆయన తన ఆవేదనను వ్యక్తం కూడా చేశారట. జూలై 4, 1991న మద్రాసులోని క్రియేటివ్ కమర్షియల్స్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో చంటి చిత్రీకరణ ప్రారంభమైంది. సత్యమూర్తి మాటలు అందించగా, తమిళ ఒరిజినల్ చిత్రానికి ఇళయరాజా అందించిన సంగీత స్వరాలనే తెలుగులో కూడా ఉపయోగించారు.

నాజర్, మంజుల, ప్రసన్న కుమార్, మహర్షి రాఘవ, సుజాత, బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య వంటి తారాగణం ఈ చిత్ర విజయానికి దోహదపడింది. ముఖ్యంగా నాజర్ పోషించిన విలన్ పాత్రకు నంది పురస్కారం లభించింది. బ్రహ్మానందం కామెడీ ట్రాక్, ముఖ్యంగా రేచీకటి సన్నివేశాలు, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డిసెంబరులో చిత్రీకరణ జరుపుకుంటుండగా, గ్యాంగ్‌లీడర్ శతదినోత్సవ వేడుకల కోసం చిరంజీవి పిలవడంతో బ్రహ్మానందం షూటింగ్ ఆలస్యమై, ఆయన సన్నివేశాలను పూర్తి చేయడానికి నాలుగు నెలలు పట్టింది. మొదట ఖుష్బూను కథానాయికగా అనుకున్నా, చివరికి మీనాను ఎంపిక చేశారు. జనవరి 10, 1992న విడుదలైన చంటి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మదనపల్లిలోని శ్రీకృష్ణ ఏసీ థియేటర్‌లో 175 రోజుల పాటు ఆడి, అసాధారణ రికార్డు సృష్టించింది. ఒక దంపతులు ప్రతిరోజూ సినిమా చూసేంతగా ప్రేక్షకులు ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యారు. వెంకటేష్‌కి ఇది 22వ చిత్రం. అప్పటి వరకు ఎక్కువగా యాక్షన్ చిత్రాలు చేసిన వెంకటేష్, చంటితో ఒక యూ-టర్న్ తీసుకొని కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లో టాప్ 10 చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తెలుగులో సాధించిన విజయంతో, వెంకటేష్ హిందీలో అనారీ పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేసి, అక్కడ కూడా విజయం సాధించారు. కరిష్మా కపూర్ కథానాయికగా నటించిన అనారీ వెంకటేష్‌కు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చంటి సినిమాకు వెంకటేష్‌ను తీసుకోవడంతో ఆ హీరో బాదపడ్డారా..
చంటి సినిమాకు వెంకటేష్‌ను తీసుకోవడంతో ఆ హీరో బాదపడ్డారా..
బుధాదిత్య యోగంతో ఈ 4 రాశులకు మహర్దశ? నవంబర్ 4 నుంచి ఏం జరగనుంది?
బుధాదిత్య యోగంతో ఈ 4 రాశులకు మహర్దశ? నవంబర్ 4 నుంచి ఏం జరగనుంది?
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
ఎంజీబీఎస్, జేబీఎస్ కాదు.. హైదరాబాద్‌లో మరో 4 భారీ బస్టాండ్లు
ఎంజీబీఎస్, జేబీఎస్ కాదు.. హైదరాబాద్‌లో మరో 4 భారీ బస్టాండ్లు
సిరీస్ గెలిచిన టీమిండియా.. నాలుగో మ్యాచ్‌లో ఊహించని మార్పులు ?
సిరీస్ గెలిచిన టీమిండియా.. నాలుగో మ్యాచ్‌లో ఊహించని మార్పులు ?
జడ్పీటీసీ అభ్యర్థినికి రూ.172 కోట్ల ఆస్తి
జడ్పీటీసీ అభ్యర్థినికి రూ.172 కోట్ల ఆస్తి
ఇల్లు కట్టేటప్పుడు ఈ 10 తప్పులు అస్సలు చేయకండి..భారీ నష్టం తప్పదు
ఇల్లు కట్టేటప్పుడు ఈ 10 తప్పులు అస్సలు చేయకండి..భారీ నష్టం తప్పదు
విద్యుత్తు తీగలు పదేపదే ట్రిప్‌ అవుతున్నాయి.. ఏంటా అని వెతగ్గా..
విద్యుత్తు తీగలు పదేపదే ట్రిప్‌ అవుతున్నాయి.. ఏంటా అని వెతగ్గా..
చరిత్ర సృష్టించేందుకు అర్ష్‌దీప్ సింగ్ రెడీ
చరిత్ర సృష్టించేందుకు అర్ష్‌దీప్ సింగ్ రెడీ
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు..
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు..