- Telugu News Entertainment Tollywood These celebrities expected to participate in Bigg Boss Telugu 7 as contestants
Bigg Boss 7: బిగ్‌బాస్ షోలో రచ్చ చేసే కంటెస్టెంట్లు వీళ్లే..! ఈసారి గ్లామర్ షోకు డోకా లేనట్లే..
బుల్లి తెరపై బిగ్‌బాస్ సందడి మళ్లీ మొదలైంది. ఇప్పటి వరకు 6 సీజన్లతో అదరగొట్టిన తెలుగు బిగ్‌బాస్ షో ఏడో సీజన్‌కు సిద్ధమైపోయింది. తాజాగా బిగ్‌బాస్-7కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అక్కినేని అందగాడు నాగార్జున సంభాషణతో రూపొందిన ప్రోమో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. బిగ్‌బాస్ 3, 4, 5, 6 సీజన్లకు నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించగా ఏడో సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్ చేస్తారని తాజాగా విడుదలైన ప్రోమోతో చెప్పేశారు..
Updated on: Aug 09, 2023 | 6:42 PM

బుల్లి తెరపై బిగ్‌బాస్ సందడి మళ్లీ మొదలైంది. ఇప్పటి వరకు 6 సీజన్లతో అదరగొట్టిన తెలుగు బిగ్‌బాస్ షో ఏడో సీజన్‌కు సిద్ధమైపోయింది. తాజాగా బిగ్‌బాస్-7కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అక్కినేని అందగాడు నాగార్జున సంభాషణతో రూపొందిన ప్రోమో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

బిగ్‌బాస్ 3, 4, 5, 6 సీజన్లకు నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించగా ఏడో సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్ చేస్తారని తాజాగా విడుదలైన ప్రోమోతో చెప్పేశారు. మరైతే కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉంటారు..? అనే దానిపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు.

తొలుత హిందీలో ప్రారంభమైన బిగ్‌బాస్ షో ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది. దీంతో వరుసగా 16 సీజన్లు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ బిగ్‌బాస్ షోలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.

త్వరలో తెలుగులో ప్రస్తుతం బిగ్‌బాస్ ఏడో సీజన్ ప్రారంభంకానుంది. సెప్టెంబర్ ప్రారంభంలో షో గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో షో మేకర్స్ చాలామంది సెలబ్రిటీలను సంప్రదించారు. ఐతే వారందరిలో ఫైనల్ లిస్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. తాజాగా ఈసారి హౌస్‌లోకి వెళ్లబోయేది వీరేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వీరిలో కార్తీక దీపం సీరియల్ నటి శోభా శెట్టి, యూట్యూబర్ శ్వేతా నాయుడు, సింగర్ సాకేత్, సింగర్ మోహన భోగరాజు, సీనియర్ బుల్లితెర నటుడు ప్రభాకర్, బుల్లితెర జంట అమర్‌దీప్- తేజస్విని, టిక్ టాక్ దుర్గారావు దంపతులు, సురేఖా వాణి, జర్నలిస్టు సురేశ్ పార్టిసిపేట్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఐతే వీరిలో నిజంగా షోలో ఎంట్రీ ఇస్తారనేదే ప్రశ్నార్ధకంగా ఉంది.




