Klin Kaara: రామ్ చరణ్ కూతురికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. కోడలి కోసం బంగారంతో చేసిన..

ప్రస్తుతం క్లింకార ఆలనాపాలనలోనే బిజీగా ఉంటోంద ఉపాసన. మరోవైపు రామ్‌ చరణ్‌ తిరిగి మళ్లీ షూటింగుల్లో బిజీ అయిపోయాడు. కాగా కొన్ని రోజుల క్రితం యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ రామ్ చరణ్‌ కూతురికి గోల్డ్‌ డాలర్స్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు శర్వానంద్‌ కూడా మెగా ప్రిన్సెస్‌ కోసం స్పెషల్‌ గిఫ్ట్‌ పంపించారని వార్తలు వచ్చాయి. తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా కొణిదెల వారసురాలికి అదిరిపోయే బహుమతి ఇచ్చారట.

Klin Kaara: రామ్ చరణ్ కూతురికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్..  కోడలి కోసం బంగారంతో చేసిన..
Ram Charan, Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Aug 02, 2023 | 6:19 PM

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌- ఉపాసన కొన్ని రోజుల క్రితమే పేరెంట్స్‌ క్లబ్‌లో చేరిపోయారు. తమ 11 ఏళ్ల వైవాహిక బంధానికి గుర్తింపుగా ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఘనంగా బారసాల చేసి మెగా ప్రిన్సెస్‌కు ‘క్లింకార కొణిదెల’ అని నామకరణం చేశారు. ప్రస్తుతం క్లింకార ఆలనాపాలనలోనే బిజీగా ఉంటోంద ఉపాసన. మరోవైపు రామ్‌ చరణ్‌ తిరిగి మళ్లీ షూటింగుల్లో బిజీ అయిపోయాడు. కాగా కొన్ని రోజుల క్రితం యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ రామ్ చరణ్‌ కూతురికి గోల్డ్‌ డాలర్స్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు శర్వానంద్‌ కూడా మెగా ప్రిన్సెస్‌ కోసం స్పెషల్‌ గిఫ్ట్‌ పంపించారని వార్తలు వచ్చాయి. తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా కొణిదెల వారసురాలికి అదిరిపోయే బహుమతి ఇచ్చారట. తన మేన కోడలు కోసం ఏకంగా బంగారు పలకను బహుమతిగా ఇచ్చాడట బన్నీ. అయితే ఆ పలక రాసుకునేది మాత్రం కాదట. క్లింకార పేరు, పుట్టిన తేదీ  తదితర వివరాలు వచ్చేలా పలకపై బంగారు అక్షరాలతో స్పెషన్‌ డిజైన్ చేయించారట.

బన్నీ ఇచ్చి న గిఫ్ట్‌ను చూసి రామ్ చరణ్‌ దంపతులు కూడా తెగ మురిసిపోయారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. బన్నీ ఏది చేసినా ట్రెండింగేనని అతని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్‌. మొదటి పార్ట్‌ను మంచి సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు డైరెక్టర్‌ సుకుమార్‌. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇక రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. శంకర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ క్రేజీ మూవీ కోసం మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.