బ్రో సినిమా బండారం బయటకు లాగుతా.. పక్కా ఆధారాలతోనే ఢిల్లీలో కంప్లయింట్: మంత్రి అంబటి రాంబాబు..
Minister Ambati Rambabu: ఇప్పటికే సినిమా కలెక్షన్లు,పవన్ కళ్యాణ్ రెన్యుమరేషన్ తో లెక్కలు కట్టి మూవీ అట్టర్ ఫ్లాప్ అంటూ ప్రకటించేసారు.అయితే కేవలం రాజకీయ కోణంతోనే తనను నేరుగా ఎదుర్కోలేక సినిమాలో ఓ క్యారెక్టర్ సృష్టించారని అంబటి చెబుతున్నారు.పనిలో పనిగా నిర్మాత విశ్వప్రసాద్ పైనా తీవ్ర ఆరోపణలు చేసారు.నిర్మాత విశ్వప్రసాద్ కు అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయని,ఎన్నారై టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు వసూలు చేసిన నిధులు ఆ కంపెనీల ద్వారా ఇండియాకు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్-మంత్రి అంబటి రాంబాబు మధ్య బ్రో మూవీ రగిల్చిన మంట చల్లారలేదు. పైగా రోజురోజుకూ ముదిరిపాకాన పడుతుంది.బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ తో చిర్రెత్తుకొచ్చిన అంబటి రాంబాబు.. విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. మొదట్లో పెద్దగా పట్టించుకోని మంత్రి అంబటి రాంబాబు, సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల తర్వాత కూడా చిత్రంలోని కొంతమంది నటులు చేస్తున్న కామెంట్స్ తో మరింత ఆగ్రహం వ్యక్తం చేసారు.దీంతో ఇక సినిమా విషయంలో ఖచ్చితంగా ఏదొకటి చేయాలని నిర్నయించుకున్నారు. ఇప్పటికే సినిమా కలెక్షన్లు,పవన్ కళ్యాణ్ రెన్యుమరేషన్ తో లెక్కలు కట్టి మూవీ అట్టర్ ఫ్లాప్ అంటూ ప్రకటించేసారు.అయితే కేవలం రాజకీయ కోణంతోనే తనను నేరుగా ఎదుర్కోలేక సినిమాలో ఓ క్యారెక్టర్ సృష్టించారని అంబటి చెబుతున్నారు.పనిలో పనిగా నిర్మాత విశ్వప్రసాద్ పైనా తీవ్ర ఆరోపణలు చేసారు.నిర్మాత విశ్వప్రసాద్ కు అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయని,ఎన్నారై టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు వసూలు చేసిన నిధులు ఆ కంపెనీల ద్వారా ఇండియాకు తరలించి పవన్ కళ్యాణ్ కు అందజేస్తున్నారని ఆరోపించారు.సినిమాలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని నిర్మాతకు సున్నితంగా హెచ్చరికలు చేసారు.
సినిమా ద్వారా తనను టార్గెట్ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న మంత్రి అంబటి రాంబాబు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టకూడదని నిర్నయించుకున్నారు.నిర్మాత విశ్వప్రసాద్ పై కేవలం ఆరోపణలు చేయడమే కాదు…సినిమా వెనుక జరిగిన లావాదేవీల బండారం బయటకు లాగాలని నిర్నయించారు.పలు ఏజెన్సీల ద్వారా మొత్తం రిపోర్టులు తెప్పించుకున్న మంత్రి రాంబాబు…దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారు.పార్టీ ఎంపీలతో కలిసి ఈ అంశంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేయనున్నారు అంబటి రాంబాబు.అయితే కంప్లైంట్ చేసే ముందు పక్కా ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.అందుకే అన్ని ఆధారాలతో ఢిల్లీకి వెళ్లారు.పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డితో పాటు మరికొంతమందిని కలిసిన తర్వాత ఈడీకి ఫిర్యాదు చేయనున్నారు.
రాజకీయ కుట్రతోనే బ్రో సినిమా: మంత్రి
బ్రో సినిమా వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు.సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా హీరో పవన్ కళ్యాణ్ కు మాత్రం 80 కోట్లు రెన్యుమరేషన్ ఇచ్చారని చెప్పారు.పవన్ కళ్యాణ్ కు రెన్యుమరేషన్ రూపంలో ఇచ్చిన నిధులు చంద్రబాబు ఇచ్చినవే అంటున్నారు.చంద్రబాబు అండ్ కో అమెరికాలో కలెక్ట్ చేసిన బ్లాక్ మనీని నిర్మాత విశ్వప్రసాద్ ద్వారా వైట్ మనీ రూపంలో ఇచ్చారంటున్నారు.అయితే మొత్తం సినిమా నిర్మాణంతో పాటు రెన్యుమరేషన్ కు సంబంధించిన లావా దేవీలు,టాక్స్ లు అన్నింటిని బయటకు తీస్తే దీంట్లో ఉన్న అసలు కోణం బయటపడుతుందన్నారు.