Vijayawada: ‘కొడుకా.. ఎక్కనున్నావయ్యా!’ టెకీ శ్రీహర్షా రెడ్డి అదృశ్యమై ఏడేళ్లు.. ఆగని కన్నోళ్ల కన్నీళ్లు!
శ్రీహర్షా రెడ్డి... ఈ పేరు వినిపిస్తే చాలు.. ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతుంటారు. ఎప్పుడెప్పుడు తమ కొడుకు తమ కళ్లెదుటకు వస్తాడా..? అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకును ఎప్పుడు చూస్తామా... అంటూ ఆవేదనను మింగుతూ.. జీవనం సాగిస్తున్నారు. ఇక.. ఎదిగిన కొడుకును గుర్తు చేసుకుంటూ బాధపడని క్షణం అంటూ లేదు. ఎవరైనా శ్రీహర్షా రెడ్డి..
విజయవాడ, ఆగస్టు 2: శ్రీహర్షా రెడ్డి… ఈ పేరు వినిపిస్తే చాలు.. ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతుంటారు. ఎప్పుడెప్పుడు తమ కొడుకు తమ కళ్లెదుటకు వస్తాడా..? అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకును ఎప్పుడు చూస్తామా… అంటూ ఆవేదనను మింగుతూ.. జీవనం సాగిస్తున్నారు. ఇక.. ఎదిగిన కొడుకును గుర్తు చేసుకుంటూ బాధపడని క్షణం అంటూ లేదు. ఎవరైనా శ్రీహర్షా రెడ్డి అనే పిలిస్తే చాలు.. వారి ప్రాణాలు లేచి వస్తాయి. తన కొడుకుపై వారు పెంచుకున్న మమకారం అలాంటిది. కొన్నేళ్లుగా కొడుకు కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది.
ఏదో ఒక రోజు తమ కొడుకు ఇంటికి తిరిగి వస్తే చాలు అని.. దేవుడిని వేడుకుంటూ కాలం వెల్లదీస్తున్న ఆ తల్లిదండ్రుల ఆవేదన తీరనిది. 7 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో అద్రుశ్యమయ్యాడు. ఇప్పటి వరకు కూడా అతని ఆచూకీ తెలియకపోవడం మిస్టరీని తలపిస్తోంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్రీహర్షా రెడ్డి.. మిస్సింగ్ వెనక ఉన్న రహస్యం ఏంటి..? పోలీసులు ఈ మిస్సింగ్ కేసును ఎందుకు ఛేదించలేకపోయారు..? దీని వెనక ఎవరైనా పెద్దల హస్తం ఉందా..? ఆ సాఫ్ట్ వేర్ తల్లిదండ్రులు ఏమంటున్నారు..?
విజయవాడ ప్రాంతానికి చెందిన శ్రీహర్షా రెడ్డి సాఫ్ట్‌వేర్‌గా పనిచేసేవాడు. ఇతనికి 2015లో వోడాఫోన్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. పుణేలోని కారాడి ప్రాంతంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసేవాడు. శ్రీహర్షా రెడ్డికి 2016 జూన్‌లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత రెండు నెలల వరకు అంత సజావుగానే సాగింది. ఆ తర్వాత 2016 ఆగస్టు 6న రూమ్ నుంచి బయటకు వెళ్లిన శ్రీహర్షా రెడ్డి.. మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆ కంపెనీ యాజమాన్యం… శ్రీహర్షా రెడ్డి తల్లిదండ్రులకు శ్రీహర్షా రెడ్డి అద్రుశ్యమైనట్లు సమాచారం అందించారు. దీంతో షాక్ కు గురైన శ్రీహర్షా రెడ్డి తల్లిదండ్రులు ముంబై వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇప్పటికీ.. ఆ వ్యక్తి ఆచూకీని కనిపెట్టలేకపోయారు.
సుమారు 6 సంవత్సరాలు గడిచినా గానీ… పోలీసులు ఈ కేసును తేల్చలేకపోయారు. తమబిడ్డ ఆచూకీ గుర్తించి తమకు అప్పజెప్పాలని అధికారుల కాళ్లు మొక్కారు శ్రీహర్షా రెడ్డి తల్లిదండ్రులు. తమ కొడుకు కనిపించకుండా పోవడంలో అక్కడి పెద్ద వ్యక్తుల హస్తం ఉందేమో అనే అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే తమ కొడుకు ఆచూకీని ఎవరూ కనిపెట్టలేకపోతున్నారని.. తమ బిడ్డ జీవించి ఉన్నాడా..? లేదా..? అనే అనుమానం కలుగుతోందని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. వారి కొడుకు కోసం వారు మొక్కని దేవుడు లేడు.. తిరగని ప్రదేశం లేదు. తమ కొడుకు ఆచూకీని కనిపెట్టాలని అప్పటి ముంబై గవర్నర్‌తో పాటు రాష్ట్రపతిని కూడా కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. అయినా ఆ తల్లిదండ్రులకు ఆవేదనను ఇప్పటికీ ఎవరూ తీర్చలేకపోయారు. ఇంకా తమ బిడ్డ తిరిగి వస్తాడని 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.