AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న యంగ్‌ హీరో.. పాత గర్ల్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్‌.. కొత్త ప్రేయసితో పెళ్లి

కవిన్‌ పెళ్లి చేసుకోబోతున్నాడన్న విషయం తెలిసిన అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఐతే నటుడు కవిన్‌ మాత్రం ఇంత వరకూ తన పెళ్లి వార్తలను అధికారికంగా ప్రకటించలేదు. ఇక కవిన్‌ గార్ల్‌ ఫ్రెండ్‌ మోనికా గురించి చెప్పాలంటే ఆమె ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. కాగా కవిన్‌ 'కనా కానమ్‌ కలలాంగల్‌' అనే టీవీ సీరియల్‌తో..

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న యంగ్‌ హీరో.. పాత గర్ల్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్‌.. కొత్త ప్రేయసితో పెళ్లి
Actor Kavin
Srilakshmi C
|

Updated on: Aug 02, 2023 | 7:06 PM

Share

ప్రముఖ తమిళ్‌ హీరో కవిన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. కవిన్‌ లేటెస్ట్ మువీ ‘దాదా’ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించిన ఈ యంగ్‌ హీరో త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి మోనికతో కలిసి ఆగస్టు 20న ఏడడుగులు నడవనున్నాడు. వీరి వివాహం వేడుక కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరగనుంది. చెన్నైలోనే వీరి విహాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కవిన్‌ పెళ్లి చేసుకోబోతున్నాడన్న విషయం తెలిసిన అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఐతే నటుడు కవిన్‌ మాత్రం ఇంత వరకూ తన పెళ్లి వార్తలను అధికారికంగా ప్రకటించలేదు. ఇక కవిన్‌ గార్ల్‌ ఫ్రెండ్‌ మోనికా గురించి చెప్పాలంటే ఆమె ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. కాగా కవిన్‌ ‘కనా కానమ్‌ కలలాంగల్‌’ అనే టీవీ సీరియల్‌తో కవిన్‌ కెరీర్‌ ప్రారంభించాడు. ఈ సీరియల్‌లో కవిన్‌ నటన ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత శరవణన్‌ మీనాక్షి, తాయుమానవన్‌ వంటి సీరియల్స్‌లోనే నటించాడు.

ఇవి కూడా చదవండి

2017లో విడుదలైన ‘సత్రియాన్‌’ చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలో కనించాడు. తన రెండో మువీ ‘నాట్పున్న ఎన్ననాను తెరియుమా’ చిత్రంతో మొదటి సారి హీరోగా మారాడు. ఐతే ఈ ఏడాది విడుదలైన ‘దాదా’తో కవిన్‌ సూపర్‌ హిట్‌ కొట్టడంతో పాపులర్‌ అయ్యాడు. సీరియల్స్‌, సినిమాలతోపాటు తమిళ బిగ్‌బాస్‌ 3 సీజన్‌లోనూ కవిన్‌ కంటెస్ట్‌గా ఉన్నాడు. ఆ షోలో మరో కంటెస్టెంట్‌ లాస్లియాతో ప్రేమాయణం నడిపాడు. తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు లాస్లియా కూడా ధృవీకరించింది. కొన్నాళ్లకు వీరిద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు