AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా? కార్బోహైడ్రేట్లను విలన్‌గా చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్!

చాలామంది బ్రెడ్, రైస్, చివరకు పండ్లను కూడా మానేసి బరువు తగ్గాలని చూస్తుంటారు. కానీ కొన్నాళ్ల తర్వాత వారిలో శక్తి తగ్గిపోవడం, వర్కవుట్ చేయలేకపోవడం, రాత్రిపూట విపరీతంగా స్వీట్లు తినాలనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి కారణం శరీరానికి అందాల్సిన సరైన ఇంధనం అందకపోవడమే.

బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా? కార్బోహైడ్రేట్లను విలన్‌గా చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్!
Carbs For Weight Loss.jpg
Nikhil
|

Updated on: Mar 15, 2026 | 10:20 AM

Share

బరువు తగ్గాలనుకునే వారు చేసే మొదటి పని ఆహారంలో కార్బోహైడ్రేట్లను (పిండి పదార్థాలు) పూర్తిగా పక్కన పెట్టడం. అన్నం తింటే లావైపోతామని, రొట్టెలు మానేస్తేనే సన్నబడతామని చాలామంది నమ్ముతుంటారు. ముఖ్యంగా ప్రోటీన్ డైట్ మీద ఉన్నవారు కార్బ్స్‌ను ఒక విలన్‌లా చూస్తారు. అయితే, ఈ పద్ధతి వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని హెచ్చరిస్తున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ బాబీ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయాల ప్రకారం.. కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శత్రువులు కాదు, అసలైన మిత్రులు. కార్బోహైడ్రేట్లు శరీరానికి ఎలా మేలు చేస్తాయో వివరంగా తెలుసుకుందాం.

కొవ్వు కరగడానికి కార్బ్స్ అవసరమా?

శరీరంలో కొవ్వు సమర్థవంతంగా కరగాలంటే కార్బోహైడ్రేట్లు తప్పనిసరి. మనం వీటిని పూర్తిగా మానేసినప్పుడు శరీర మెటబాలిజం నెమ్మదిస్తుంది. దీనివల్ల వర్కవుట్ చేసే శక్తి ఉండదు. ఫలితంగా శరీరం కొవ్వును కరిగించడానికి బదులు, కండరాలను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అన్ని రకాల కార్బోహైడ్రేట్లు చెడ్డవి కావు. మనం తీసుకునే వనరును బట్టి ఫలితం ఉంటుంది.

  • మంచివి: ఓట్స్, బంగాళాదుంపలు, బియ్యం, పండ్లు వంటివి శరీరానికి స్థిరమైన శక్తిని ఇస్తాయి. వ్యాయామం తర్వాత శరీరం త్వరగా కోలుకోవడానికి ఇవి తోడ్పడతాయి.
  • చెడ్డవి: కేకులు, పేస్ట్రీలు, చిప్స్, సోడాలు రక్తంలోని చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచుతాయి. ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.

ఎలా తీసుకోవాలి?

కార్బోహైడ్రేట్లను సరైన పద్ధతిలో తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. నిపుణుల సూచన ప్రకారం, కార్బ్స్‌ను ఎప్పుడూ లీన్ ప్రోటీన్ మరియు కూరగాయలతో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఆ పిండి పదార్థాలను శక్తిగా వాడుకుంటుంది తప్ప కొవ్వుగా మార్చదు. ముఖ్యంగా వర్కవుట్ చేసే సమయానికి అటూ ఇటూగా కార్బ్స్ తీసుకోవడం వల్ల కండరాలు దెబ్బతినకుండా ఉంటాయి. కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేయడం కంటే, సరైన నాణ్యమైన ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యం. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి, సహజసిద్ధమైన పిండి పదార్థాలను మీ డైట్‌లో భాగం చేసుకోండి. అప్పుడే ఆరోగ్యంగా, చురుగ్గా బరువు తగ్గడం సాధ్యమవుతుంది.

Follow Us
ప్రియురాలి కోసం పిల్లాడి పిచ్చి సాహసం.. 5ఏళ్లకే బస్సు ఎత్తుకెళ్లి
ప్రియురాలి కోసం పిల్లాడి పిచ్చి సాహసం.. 5ఏళ్లకే బస్సు ఎత్తుకెళ్లి
రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు
రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు
150 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే సైన్యంలోకి పంపాల్సిందే!
150 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే సైన్యంలోకి పంపాల్సిందే!
ఎన్టీఆర్‌కు ఇష్టమైన కారు ఇప్పుడు ఎక్కడుందో తెలుసా.?
ఎన్టీఆర్‌కు ఇష్టమైన కారు ఇప్పుడు ఎక్కడుందో తెలుసా.?
వెండిపై లోన్.. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరు నష్టపోవడం పక్కా..
వెండిపై లోన్.. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరు నష్టపోవడం పక్కా..
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
సొమ్మసిల్లిన విషసర్పానికి సపర్యలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా
సొమ్మసిల్లిన విషసర్పానికి సపర్యలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా
వేసవిలో బెస్ట్ హెల్తీ డ్రింక్.. రాగి పాలు.. హెల్తీగా, టేస్టీగా..
వేసవిలో బెస్ట్ హెల్తీ డ్రింక్.. రాగి పాలు.. హెల్తీగా, టేస్టీగా..
అరేయ్.. ఏంట్రా ఇదీ.. లవర్‌తో లొల్లి.. టవర్ ఎక్కి ఏం చేశాడంటే?
అరేయ్.. ఏంట్రా ఇదీ.. లవర్‌తో లొల్లి.. టవర్ ఎక్కి ఏం చేశాడంటే?
బాబా వంగా జోస్యం..వచ్చే వారం ఈ 5 రాశుల వారికి కనకవర్షం! విలాసవంతం
బాబా వంగా జోస్యం..వచ్చే వారం ఈ 5 రాశుల వారికి కనకవర్షం! విలాసవంతం