AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయి మళ్ళీ బతికే మొక్క..రోజ్ ఆఫ్ జెరికో మాయాజాలం చూస్తే అవాక్కే! ఇంట్లో ఉంటే అదృష్టమే!!

ప్రకృతిలో ఎన్నో వింతలు ఉన్నాయి. కానీ, చనిపోయినట్లు కనిపించి మళ్ళీ బతికే మొక్క గురించి విన్నారా? అవును.. రోజ్ ఆఫ్ జెరికో అని కూడా పిలువబడే ఈ ప్లాంట్ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కకు ఒక విలక్షణమైన శక్తి ఉంది. దీనిని పునరుజ్జీవన మొక్క (Resurrection Plant) అని కూడా పిలుస్తారు. అంటే చావులేనిది అని అర్థం. ఎందుకంటే ఇది చనిపోయినట్లు కనిపించినా మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది.

చనిపోయి మళ్ళీ బతికే మొక్క..రోజ్ ఆఫ్ జెరికో మాయాజాలం చూస్తే అవాక్కే! ఇంట్లో ఉంటే అదృష్టమే!!
Resurrection Plant
Jyothi Gadda
|

Updated on: Apr 05, 2026 | 8:02 AM

Share

ప్రకృతిలో మన ఊహకు అందని ఎన్నో వింతలు ఉన్నాయి. అందులో ఒకటి రోజ్ ఆఫ్ జెరికో. సాధారణంగా మొక్కలకు నీరు లేకపోతే కొద్ది రోజుల్లోనే ఎండిపోయి చనిపోతాయి. కానీ ఈ మొక్క మాత్రం ఎన్ని ఏళ్లయినా నీరు లేకపోయినా చావదు. నీరు దొరకగానే మళ్ళీ చిగురిస్తుంది. ఈ ఆసక్తికర మొక్కకు సంబంధించిన పూర్తి విశేషాలు ఇక్కడ చూద్దాం..

రోజ్ ఆఫ్ జెరికో ప్రత్యేకతలు:

ఎడారిలోని కఠినమైన ఎండలకు నీరు దొరకనప్పుడు, ఈ మొక్క తనలోని తేమను కోల్పోకుండా ఉండటానికి ఒక బంతిలా ముడుచుకుపోతుంది. చూడటానికి ఇది ఎండిపోయిన గడ్డి చుట్టలా కనిపిస్తుంది. తనలోని తేమను కోల్పోకుండా ఉండటానికి ఒక బంతిలా ముడుచుకుపోతుంది. ఈ స్థితిలో దీని మెటబాలిజం దాదాపు ఆగిపోతుంది. కానీ ఇది చనిపోదు, కణాలు మాత్రం జీవించే ఉంటాయి. కేవలం సుప్త చేతనావస్థ (Dormancy) లోకి వెళ్తుంది. ఎండిపోయిన ఈ గడ్డి బంతిని నీటిలో ఉంచినప్పుడు, అది నీటిని పీల్చుకుని నెమ్మదిగా విచ్చుకోవడం ప్రారంభిస్తుంది. కేవలం 3 నుండి 4 గంటల్లోనే అది పూర్తిగా విచ్చుకుని, పచ్చని ఆకులతో కళకళలాడుతుంది. నీరు దొరకగానే ఇది మళ్ళీ కిరణజన్య సంయోగ క్రియను (Photosynthesis) ప్రారంభించడం ఒక అద్భుతం.

ఇవి కూడా చదవండి

అందుకే దీనిని పునరుజ్జీవన మొక్క అని పిలుస్తారు. నీరు లేని సమయంలో ఇది భూమి నుండి విడివడి గాలికి దొర్లుతూ వెళ్తుంది. ఎక్కడైనా తేమ తగిలితే అక్కడ స్థిరపడి మళ్ళీ విచ్చుకుంటుంది. ఇలా ఇది తన మనుగడను సాగిస్తుంది. చాలామంది దీనిని తమ ఇళ్లలో అలంకరణ మొక్కగా పెంచుకుంటారు. దీనిని మట్టిలో నాటాల్సిన అవసరం లేదు, కేవలం ఒక చిన్న పాత్రలో నీరు పోసి అందులో ఉంచితే సరిపోతుంది. ఇది చూసే వారికి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. శాస్త్రీయంగా దీనిని సెలాజినెల్లా లాపిడోఫిల్లా (Selaginella lepidophylla) అని పిలుస్తారు. దీనిలోని కణాలు తీవ్రమైన కరువును తట్టుకునేలా రూపొందాయి. అనేక సంస్కృతులలో దీనిని అదృష్టాని, కొత్త ప్రారంభానికి చిహ్నంగా భావిస్తారు.

ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా, సరైన సమయం కోసం వేచి ఉండి మళ్ళీ ఎలా పుంజుకోవాలో ఈ మొక్క మనకు నేర్పుతుంది. ప్రకృతి మనకు అందించిన ఈ చిన్న మొక్కలో ఎంతటి గొప్ప జీవన పాఠం దాగి ఉందో కదా!

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంతకాలం దుబాయ్‌లో ఉందనుకున్నారు.. కానీ, హైదరాబాద్‌లోనే మాయమైంది..
ఇంతకాలం దుబాయ్‌లో ఉందనుకున్నారు.. కానీ, హైదరాబాద్‌లోనే మాయమైంది..
Video: పాక్ ప్లేయర్ నోటిదూల తీర్చిన టీమిండియా ప్లేయర్..
Video: పాక్ ప్లేయర్ నోటిదూల తీర్చిన టీమిండియా ప్లేయర్..
అర్ధరాత్రి 10 అడుగుల భయంకర రూపం.. వీడియో చూస్తే..
అర్ధరాత్రి 10 అడుగుల భయంకర రూపం.. వీడియో చూస్తే..
బంపరాఫర్ కొట్టేసిన శ్రీలీల.. ఏకంగా సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్!
బంపరాఫర్ కొట్టేసిన శ్రీలీల.. ఏకంగా సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్!
వీళ్లు మామూలోళ్లు కాదు భయ్యా.. చూస్తే షాక్!
వీళ్లు మామూలోళ్లు కాదు భయ్యా.. చూస్తే షాక్!
ఆగస్టు 31లోగా ITR ఎవరు దాఖలు చేయాలి? వారికి అక్టోబర్‌ 31 గడువు..!
ఆగస్టు 31లోగా ITR ఎవరు దాఖలు చేయాలి? వారికి అక్టోబర్‌ 31 గడువు..!
బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై..ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై..ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
మత్తోన్మాదులు.. మెడికోను 3 సార్లు కారుతో ఢీకొట్టారు..
మత్తోన్మాదులు.. మెడికోను 3 సార్లు కారుతో ఢీకొట్టారు..
కామిక ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? ఈరోజు విష్ణువును ఇలా
కామిక ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? ఈరోజు విష్ణువును ఇలా
అరెరె ఇన్నాళ్లు ఇంత పొరపాటు చేశామా.. వానాకాలంలో కొబ్బరి నీళ్లు..
అరెరె ఇన్నాళ్లు ఇంత పొరపాటు చేశామా.. వానాకాలంలో కొబ్బరి నీళ్లు..