- Telugu News Photo Gallery Cinema photos Pan India star Prabhas and Malayalam star Prithviraj ready to move in Tollywood Telugu Entertainment Photos
Prabhas: మలయాళ స్టార్ తో ప్రభాస్ కొత్త మూవీ.. డార్లింగ్ లిస్ట్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్..
డార్లింగ్ ప్రభాస్ లిస్ట్‌లోకి మరో క్రేజీ ప్రాజెక్ట్ యాడ్ కానుందా? ప్రజెంట్ వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్న డార్లింగ్ ఓ స్టార్ హీరో కాంబినేషన్‌లో సినిమాకు రెడీ అవుతున్నారా..? ప్రజెంట్ ఈ డిస్కషనే సౌత్ సర్కిల్స్‌లో హైప్ పెంచేస్తోంది.త్వరలో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్. ఆల్రెడీ కల్కి 2898 ఏడి ప్రమోషన్ కూడా షురూ చేశారు. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది.
Updated on: Aug 03, 2023 | 2:36 PM

డార్లింగ్ ప్రభాస్ లిస్ట్‌లోకి మరో క్రేజీ ప్రాజెక్ట్ యాడ్ కానుందా? ప్రజెంట్ వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్న డార్లింగ్ ఓ స్టార్ హీరో కాంబినేషన్‌లో సినిమాకు రెడీ అవుతున్నారా..? ప్రజెంట్ ఈ డిస్కషనే సౌత్ సర్కిల్స్‌లో హైప్ పెంచేస్తోంది.

త్వరలో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్. ఆల్రెడీ కల్కి 2898 ఏడి ప్రమోషన్ కూడా షురూ చేశారు. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా లైన్‌లో ఉంది. సలార్, కల్కి సినిమాలకు సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి.

ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్ ఈ టైట్ షెడ్యూల్‌లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. మలయాళ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో డార్లింగ్ ఓ సినిమా చేయబోతున్నారట.

లూసీఫర్ సినిమాతో దర్శకుడిగా మారిన పృథ్వీరాజ్ తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ డైరెక్టర్ ఇప్పుడు డార్లింగ్‌ను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

సలార్ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటిస్తున్నారు పృథ్వీరాజ్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే డార్లింగ్‌కు ఓ యాక్షన్ డ్రామా కథ వినిపించారట. లైన్ ప్రభాస్‌కు బాగా నచ్చటంతో వర్కవుట్ చేద్దామని మాట కూడా ఇచ్చారట. అంతా ఓకే అయినా ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ మాత్రం లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

ప్రజెంట్ నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న పృథ్వీరాజ్, ప్యారలల్‌గా లూసీఫర్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రభాస్ చేతిలో కూడా నాలుగైదు సినిమాలు ఉండటంతో ఆ ప్రాజెక్ట్ అన్ని పూర్తయితేగానీ ప్రభాస్, పృథ్వీరాజ్ కాంబో సెట్స్ మీదకు వెళ్లే పరిస్థితి లేదు.

మరి అప్పటి వరకు డార్లింగ్ వెయిట్ చేస్తారా..? లేదా సెట్స్ మీద ఉన్న సినిమాలతో పాటు మలయాళ దర్శకుడి మూవీని కూడా పట్టాలెక్కిస్తారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.




