- Telugu News Photo Gallery Cinema photos Tamil Director Rajiv Menon's Daughter Saraswathi is making her debut as a heroine
హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న ప్రముఖ డైరెక్టర్ కూతురు.. అందంలో చందమామకు పోటీ
ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ రాజీవ్‌మీనన్ తాజాగా నటుడుగానూ మారాడు. తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుదలై మువీలో కీలక పాత్రలో నటించారు. తాజాగా వెపన్ అనే మరో చిత్రంలో విలన్ పాత్రలో నటించారు కూడా. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదలవనుంది. ఇక రాజీవ్‌మీనన్ వారసురాలు సరస్వతి కూడా కథానాయకిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు..
Updated on: Aug 03, 2023 | 1:58 PM

ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ రాజీవ్‌మీనన్ తాజాగా నటుడుగానూ మారాడు. తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుదలై మువీలో కీలక పాత్రలో నటించారు. తాజాగా వెపన్ అనే మరో చిత్రంలో విలన్ పాత్రలో నటించారు కూడా.

ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదలవనుంది. ఇక రాజీవ్‌మీనన్ వారసురాలు సరస్వతి కూడా కథానాయకిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

తమిళ రాజకీయాలను ఫోకస్ చేస్తూ మూమెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జీఏ హరికృష్ణన్ నిర్మిస్తోన్న చిత్రంలో సరస్వతి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ మువీకి ఈ రంగనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు సెల్వరాఘవన్, యోగిబాబు, సునీల్, షైన్ టామ్ చాకో, రాధారవి, వినోదిని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఐతే ఈ మువీకి ఇంకా టైటిల్ ఖరారుకాలేదు. సరస్వతి ఈ మువీ కంటే ముందు 'సర్వం తాళమయం' అనే మువీలోని ఓ పాటలో కనిపించారు. సరస్వతి నటిస్తోన్న కొత్త మువీ చిత్రీకరణ దిండిగల్, రామనాథపురం, కొడైకెనాల్‌లలో జరుగుతోంది.





























