- Telugu News Photo Gallery Cinema photos Raghava Lawrence Chandramukhi 2 movie posters catch to trollers Telugu Entertainment Photos
Chandramukhi 2: చంద్రముఖి 2 వచ్చేసిందంటూ.. రిలీజ్ చేసిన పోస్టర్లను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు
క్లాసిక్ హిట్ చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన పీ వాసు, సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసిన మేకర్స్, ట్రోలర్స్‌కు దొరికిపోయారు.సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిలిం కెరీర్ ఇక ముగిసినట్టే అనుకుంటున్న టైమ్‌లో సూపర్ హిట్‌తో రజనీ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసిన సినిమా చంద్రముఖి. పీ వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది.
Updated on: Aug 03, 2023 | 1:07 PM

క్లాసిక్ హిట్ చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన పీ వాసు, సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసిన మేకర్స్, ట్రోలర్స్‌కు దొరికిపోయారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిలిం కెరీర్ ఇక ముగిసినట్టే అనుకుంటున్న టైమ్‌లో సూపర్ హిట్‌తో రజనీ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసిన సినిమా చంద్రముఖి. పీ వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. హారర్ థ్రిల్లర్ జానర్‌లో క్లాసిక్‌గా నిలిచిపోయింది.

చంద్రముఖి రిలీజ్ అయిన దగ్గర నుంచే ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించాలన్న డిమాండ్స్ వినిపించాయి. రజనీకాంత్ ఇంట్రస్ట్ చూపించకపోవటంతో సీక్వెల్ డీలే అవుతూ వచ్చింది. ఫైనల్‌గా హారర్ సినిమాలో స్పెషలిస్ట్ లారెన్స్ హీరోగా చంద్రముఖి 2ను తెరకెక్కించారు దర్శకుడు పీ వాసు.

తాజాగా చంద్రముఖి 2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ మీద సోషల్ మీడియా విమర్శలు వినిపిస్తున్నాయి. రజనీ చేసిన రోల్‌కు లారెన్స్ స్పూఫ్ చేశారా? అంటూ సెటైర్స్ వేస్తున్నారు నెటిజెన్స్. అంతేకాదు గతంలో ఇదే థీమ్‌తో వచ్చిన నాగవల్లి సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.

వెంకటేష్ హీరోగా నాగవల్లి పేరుతో చంద్రముఖి తరహా కథతోనే ఓ సినిమా తెరకెక్కించారు. వెంకీ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా, అభిమానులను నిరాశపరిచింది. ఆ సినిమాలో వెంకీ లుక్‌తో పాటు, కథా కథనాలు కూడా ఆకట్టుకోలేదు.

ఇప్పుడు చంద్రముఖి 2లో లారెన్స్ లుక్ కూడా అలాగే ఉండటంతో సినిమా రిజల్ట్ మీద అనుమానాలు మొదలయ్యాయి. మరి ఈ డౌట్స్‌కు మేకర్స్, కంటెంట్‌తో చెక్ పెడతారేమో చూడాలి.




