- Telugu News Photo Gallery Cinema photos Actress Tamannaah's films are releasing back to back in August
Tamannaah Bhatia: ఆగస్టులో సందడంతా నాదే అంటున్న అందాల తమన్నా..
బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల రిలీజులతో ఆడియన్స్ కి దగ్గర కావడానికి ట్రై చేస్తున్నారు తమన్నా. వీటిలో ఏ ఒక్కటి హిట్ అయినా, ఇండస్ట్రీలో ఫుల్ స్వింగ్ మీద ఉండొచ్చన్నది మిల్కీ బ్యూటీ ఐడియా. స్వింగ్ జర స్వింగ్ జర అని ఖుషీ ఖుషీగా పాడుకుంటున్నారు తమన్నా. ఆగస్టు 10న జైలర్ రిలీజ్ అవుతుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ పక్కన నటించడం అంటే మామూలు విషయం కాదు. ఆ అదృష్టం దక్కినందుకు హ్యాపీగా ఉందంటున్నారు మిల్కీ బ్యూటీ.
Updated on: Aug 03, 2023 | 11:42 AM

శ్రుతిహాసన్‌కి జనవరి ఎంత ఇంపార్టెంట్ మంత్ అనిపించిందో, ఆమె ఫ్రెండ్ తమన్నాకి ఆగస్టు కూడా అంతే ఇంపార్టెంట్ నెల. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల రిలీజులతో ఆడియన్స్ కి దగ్గర కావడానికి ట్రై చేస్తున్నారు తమన్నా. వీటిలో ఏ ఒక్కటి హిట్ అయినా, ఇండస్ట్రీలో ఫుల్ స్వింగ్ మీద ఉండొచ్చన్నది మిల్కీ బ్యూటీ ఐడియా.

స్వింగ్ జర స్వింగ్ జర అని ఖుషీ ఖుషీగా పాడుకుంటున్నారు తమన్నా. ఆగస్టు 10న జైలర్ రిలీజ్ అవుతుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ పక్కన నటించడం అంటే మామూలు విషయం కాదు. ఆ అదృష్టం దక్కినందుకు హ్యాపీగా ఉందంటున్నారు మిల్కీ బ్యూటీ. ఆల్రెడీ ఆమె కనిపించే 'కావాలా...' పాట సూపర్ డూపర్ వైరల్ అవుతోంది.

ఆగస్టు 11న విడుదలకు రెడీ అవుతోంది భోళా శంకర్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా ఇది. మెగాస్టార్ పక్కన నటించడం మిల్కీ బ్యూటీకి కొత్తేం కాదు. అయితే, తెలుగులో సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ టైమ్‌లో భోళా శంకర్ లాంటి లార్జ్ స్కేల్ సినిమా రావడం మాత్రం కీలకం. ఆ విషయం అర్థం చేసుకున్నారు కాబట్టే, భోళా శంకర్ రిలీజ్ కోసం... మెగా ఫ్యాన్స్ తో పాటు తమన్నా కూడా ఇష్టంగా ఎదురుచూస్తున్నారు.

గత కొన్నాళ్లుగా పర్సనల్ లైఫ్ లవ్‌స్టోరీతోనూ, రీల్ లైఫ్ లస్ట్ స్టోరీస్‌తోనూ న్యూస్‌లో ఉంటున్నారు తమన్నా. లస్ట్ స్టోరీస్‌లో తమన్నాలోని ఇంకో యాంగిల్ చూశామని ప్రశంసల వర్షం కురిపించారు ఫ్యాన్స్.

ఆగస్టులో బ్యాక్ టు బ్యాక్ రిలీజులు, ప్రమోషన్లతో బిజీగా ఉంటారు తమన్నా. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని అజిత్ మూవీ సెట్స్ లో జాయిన్ అవుతారు. అజిత్ లేటెస్ట్ సినిమా విడాముయర్చి నుంచి త్రిష ఔట్ అయ్యారని, ఆ ప్లేస్‌ని తమన్నాఫిల్ చేశారని కోలీవుడ్ టాక్. చాలా ఏళ్ల తర్వాత అజిత్, తమన్నా జోడీ ఆడియన్స్‌కు కనువిందు చేయనుంది.





























