AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ సర్వీస్‌ పేరిట వలపు వల.. ఒకరికి తెలియకుండా మరొకరితో 4 పెళ్లిళ్లు! కట్ చేస్తే ఉమ్మడి భర్తను చితక్కొట్టిన సతీమణులు

మహిళలకు తోడుగా ఉంటానని, వారి హక్కుల కోసం పోరాటం చేస్తానని చెప్పి ఓ సంఘాన్ని స్థాపించాడో సంఘసంస్కర్త. సామాజిక న్యాయం, మహిళా సాధికారత అంటూ మాయమాటలు చెప్పి పలువురు మహిళలను బుట్టలో వేసుకున్నాడు. కట్‌ చేస్తే ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపి ఏకంగా నలుగురు మహిళలను పెళ్లి చేసుకుని జల్సా చేయసాగాడు. మంగళవారం అతగాడి బండారం బయటపడటంతో భార్యలందరూ కలిసి ఉమ్మడి భర్తను చితక్కొట్టి..

సోషల్ సర్వీస్‌ పేరిట వలపు వల.. ఒకరికి తెలియకుండా మరొకరితో 4 పెళ్లిళ్లు! కట్ చేస్తే ఉమ్మడి భర్తను చితక్కొట్టిన సతీమణులు
Wasim Zafar
Srilakshmi C
|

Updated on: Aug 03, 2023 | 11:04 AM

Share

దావణగెరె, ఆగస్టు 2: మహిళలకు తోడుగా ఉంటానని, వారి హక్కుల కోసం పోరాటం చేస్తానని చెప్పి ఓ సంఘాన్ని స్థాపించాడో సంఘసంస్కర్త. సామాజిక న్యాయం, మహిళా సాధికారత అంటూ మాయమాటలు చెప్పి పలువురు మహిళలను బుట్టలో వేసుకున్నాడు. కట్‌ చేస్తే ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపి ఏకంగా నలుగురు మహిళలను పెళ్లి చేసుకుని జల్సా చేయసాగాడు. మంగళవారం అతగాడి బండారం బయటపడటంతో భార్యలందరూ కలిసి ఉమ్మడి భర్తను చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ షాకింగ్‌ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరెలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

దావణగెరెకు చెందిన మహ్మద్‌ వసీం జాఫర్‌ అలియాస్‌ సల్మాన్‌ ఖాన్‌ సాధిక్‌ (35) మదీనా లేఅవుట్‌లోని బంధే నవాజ్ మసీదు వద్ద ఓ మానవ హక్కుల సంస్థను స్థాపించాడు. సామాజిక సేవ పేరిట బాబు బిజీగా ఉండేవాడు. ఐతే అక్కడకు వచ్చే అమ్మాయిలతో జాఫర్‌ మాటకలిపి ముగ్గులోకి లాగేవాడు. అనంతరం వారిని వివాహం చేసుకునేవాడు. ఇలా హరిహరలో హష్మత్ (మొదటి భార్య), దావణగెరెలోని వెంకోబా కాలనీలో నైముసి (రెండో భార్య), దావణగెరెలోని మరోవీధిలోని వినోబానగర్‌లో జుబేదు బాను (మూడో వ్యక్తి), మలెబెన్నూరులో మరో యువతి (నాలుగో భార్య)తో కాపురం ఉన్నాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లాడి ఒకే ఏరియాలో నాలుగిళ్లలో కాపురం పెట్టాడు. వారి నుంచి నగదు, ఆభరణాలను తీసుకుని తన విలాసాలకు ఖర్చు చేసుకుంటూ జల్సాలు చేసేవాడు.

అంతేకాకుండా ఎక్కువ వడ్డీ ఆశచూపి 70 మంది నుంచి రుణాలు తీసుకున్నాడు. అల్పసంఖ్యాకుల సమస్యలపై పోరాటం చేస్తానని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని, పలువురిని వంచించాడని ఆరోపణలు మొదలయ్యాయి. ఆయన వివరాలన్నీ సతీమణులు ఎలాగో సేకరించారు. సాధిక్‌ నాలుగో భార్యతో కలిసి ఉండగా మొదటి ముగ్గురు భార్యలు, వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దాడిచేసి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆజాద్‌ నగర ఠాణాలో అప్పగించి కేసులు పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.