AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపలు తింటున్నారా.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి.. లేకపోతే ప్రాణాలకే రిస్క్..

మాంసాహార ప్రియులకు చేపలు అంటే ఎంతో ఇష్టం. రుచితో పాటు ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇతర మాంసాహారంతో పోలిస్తే ఇవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి గ్యాస్ కూడా ఆదా అవుతుంది. అయితే చేపలు ఎంత ఆరోగ్యకరమైనవో, వాటిని కొన్ని రకాల ఆహారాలతో కలిపి తీసుకోవడం అంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చేపలు తిన్నప్పుడు ఏయే పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం.

Krishna S
|

Updated on: Mar 15, 2026 | 8:24 PM

Share
సిట్రస్ పండ్లు: నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లలో ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చేపలలోని ప్రోటీన్‌ను శరీరం సరిగ్గా గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల పేగుల్లో అసౌకర్యం, తీవ్రమైన కడుపు నొప్పి, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

1 / 5
పాలు - పాల ఉత్పత్తులు: చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు చేపలు తిన్న వెంటనే పాలు తాగడం లేదా పెరుగు తినడం. చేపలు, పాల ఉత్పత్తుల స్వభావం వేరువేరుగా ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది కడుపు ఉబ్బరం, కడుపు నొప్పికి దారితీయడమే కాకుండా, కొంతమందిలో చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతుంటారు.

2 / 5
కూల్ డ్రింక్స్: చేపలు తిన్న తర్వాత సోడా లేదా కూల్ డ్రింక్స్ వంటి కార్బోనేటేడ్ పానీయాలు తాగడం అస్సలు మంచిది కాదు. ఇవి సహజ సిద్ధమైన జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తాయి. ఫలితంగా కడుపులో అసౌకర్యం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

3 / 5
అధిక ప్రోటీన్ కలిగిన పప్పుధాన్యాలు: చేపల్లో ఇప్పటికే ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. దీనికి తోడు పప్పులు, బీన్స్ లేదా పుట్టగొడుగులు వంటి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలను కలిపి తీసుకున్నప్పుడు, జీర్ణవ్యవస్థపై భారం పెరుగుతుంది. ఇది జీర్ణ రుగ్మతలకు దారితీస్తుంది. కాబట్టి వీటిని విడివిడిగా తీసుకోవడమే ఉత్తమం.

4 / 5
పిండి పదార్ధాలు: పాస్తా, బంగాళాదుంపలు వంటి పిండి పదార్థాలను చేపలతో కలిపి అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది మీకు తెలియకుండానే మీలో నీరసాన్ని, బద్ధకాన్ని కలిగిస్తుంది. అందుకే చేపలతో పాటు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

5 / 5
Follow Us
ప్రియురాలి కోసం పిల్లాడి పిచ్చి సాహసం.. 5ఏళ్లకే బస్సు ఎత్తుకెళ్లి

రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు

150 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే సైన్యంలోకి పంపాల్సిందే!

ఎన్టీఆర్‌కు ఇష్టమైన కారు ఇప్పుడు ఎక్కడుందో తెలుసా.?

వెండిపై లోన్.. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరు నష్టపోవడం పక్కా..

హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
సొమ్మసిల్లిన విషసర్పానికి సపర్యలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా

వేసవిలో బెస్ట్ హెల్తీ డ్రింక్.. రాగి పాలు.. హెల్తీగా, టేస్టీగా..

అరేయ్.. ఏంట్రా ఇదీ.. లవర్‌తో లొల్లి.. టవర్ ఎక్కి ఏం చేశాడంటే?

బాబా వంగా జోస్యం..వచ్చే వారం ఈ 5 రాశుల వారికి కనకవర్షం! విలాసవంతం