బాబోయ్.. వీరికి తోటకూర డేంజర్.. తింటే కష్టాలే కష్టాలు

samatha

29 october 2026

Pic credit - Pinterest

తోటకూర అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా ప్రతి రోజూ తోటకూరను తింటుంటారు.

తోటకూర

ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి ఎక్కువగా ఉండటం వలన శరీరానికి చాలా మేలు చేస్తుంది.

ఐరన్ , విటమిన్ సి

అందుకే తోట కూర ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరూ ఇష్టంగా ఈ కర్రీని తింటుంటారు. కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడే వారు దీనిని అస్సలే తినకూడదంట.

ఆరోగ్యానికి మంచిదైనా కొందరు తినకూడదు

కాగా, ఇప్పుడు మనం అసలు తోట కూర ఎవరు తినకూడదు. ఎవరు తినడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో వివరంగా తెలుసుకుందాం.

ఎవరు తినకూడదు

ఎవరు అయితే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో వారు అస్సలే తోట కూర తినకూడదంట. తోటకూరలో ఆక్సలేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.

కిడ్నీ సమస్యలతో బాధపడే వారు

అందువలన తోట కూర తినడం వలన కిడ్నీలో రాళ్లు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తోటకూర తినకూడదు.

కిడ్నీ రాళ్లు

అంతే కాకుండా యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడే వారు కూడా వీలైనంత వరకు తోటకూర తినకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు.

యూరిక్ యాసిడ్

అంతే కాకుండా కొన్ని రకాల మందులు వాడే వారు,  జీర్ణ  సమస్యలతో బాధపడే వారు కూడా వీలైనంత వరకు తోటకూరకు దూరం ఉండాలి.

జీర్ణ సమస్యలు