Jupally Krishna Rao: కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల.. ఖర్గే సమక్షంలో..
Jupally Krishna Rao joins Congress: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరారు. జూపల్లి కృష్ణారావుతోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Jupally Krishna Rao joins Congress: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరారు. జూపల్లి కృష్ణారావుతోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు పలువురు నాయకులు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
కాగా.. జూపల్లి కృష్ణారావు ఎప్పుడో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలనుకున్నారు జూపల్లి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరహాలో సభ నిర్వహించి కండువా కప్పుకోవాలనుకున్నారు. అయితే, రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. జూపల్లి కృష్ణారావు, ఆయన వర్గీయులు కాంగ్రెస్‌లో చేరేందుకు తొలుత కొల్లాపూర్ సభను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. సభకు రాహుల్ లేదా ప్రియాంకను పిలిచి వారి సమక్షంలో చేరాలని భావించారు.
అయితే, అనివార్య కారణాల వల్ల సభ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉండటంతో, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల, ఇతర నేతలు ఢిల్లీ వెళ్లి పార్టీ చేరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..