Zero Shadow Day: నేడు జీరో షాడో డే..హైదరాబాద్‌లో సరిగ్గా ఈ టైంకి మీ నీడ కనిపించదోచ్..!
నగరంలో ఈ రోజు అరుదైన 'జీరోషాడో' ఆవిష్కృతం కాబోతోంది. సరిగ్గా ఈ రోజు మధ్యాహ్నం 12.23 నిముషాలకు మన నీడ కనబడకుండా పోతుంది. సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలో నిటారుగా ఉంచిన వస్తువుల మీద నీడ కనిపించకుండా పోవడాన్ని జీరో షాడో అంటారు. ఇలా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుందట. ఎందుకిలా జరుగుతుందంటే.. భూమి సూర్యుని చుట్టూ భ్రమణం చేసే క్రమంలో సూర్య కిరణాలు..
హైదరాబాద్, ఆగస్టు 2: నగరంలో ఈ రోజు అరుదైన ‘జీరోషాడో’ ఆవిష్కృతం కాబోతోంది. సరిగ్గా ఈ రోజు మధ్యాహ్నం 12.23 నిముషాలకు మన నీడ కనబడకుండా పోతుంది. సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలో నిటారుగా ఉంచిన వస్తువుల మీద నీడ కనిపించకుండా పోవడాన్ని జీరో షాడో అంటారు. ఇలా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుందట. ఎందుకిలా జరుగుతుందంటే.. భూమి సూర్యుని చుట్టూ భ్రమణం చేసే క్రమంలో సూర్య కిరణాలు భూమిని తాకే కోణం ఏడాది పొడుగునా మారుతూ ఉంటుంది. దాని వలన సూర్యూని కిరణాల దిక్కు మూరుతూ ఉంటుంది. భూమి అక్షాంశాలు 23.45 డిగ్రీల వంపు సూర్యుని మధ్యతలంలో ఉన్నప్పుడు భూగ్రహ మధ్య తలం కోణంలో మార్పు వస్తుంది. దీనినే సౌర క్షీణత అంటారు. సౌర క్షీణత ఒక ప్రదేశం యొక్క అక్షాంశంతో సమమైనప్పుడు సౌర క్షీణత ఏర్పడుతుంది.
భూమి గోళాకారంగా ఉండటం వల్ల సూర్యకిరణాలు మధ్యాహ్నం భూమధ్యరేఖపై మాత్రమే పడతాయి. ఫలితంగా ఉత్తరాన, దక్షిణాన నేరుగా పడవు. సూర్యుని గమనం ఉత్తరాయణంలో 6 నెలలు ఉత్తర దిశగా, దక్షిణాయనంలో 6 నెలలు దక్షిణ దిశగా ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ సమయంలో భూమి వంపు సుమారు 23.5 డిగ్రీలు ఉండటంతో భూమధ్య రేఖకు అన్ని డిగ్రీల ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సూర్య కిరణాలు మధ్యాహ్నం నేరుగా తలమీదగా పడతాయి. ఇలా ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణంలో ఒకసారి చొప్పున జరగడం వల్ల ఏడాదికి రెండుసార్లు జీరోషాడో డే వస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.