Dry Fruits: ఏ టైంకి ఏ డ్రైఫ్రూట్స్ తింటే ఎక్కువ ప్రయోజనం? ఈ సీక్రెట్ చాలామందికి తెలియదు!
Best Time To Eat Dry Fruits: డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే రోజంతా శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్‌ను ఎప్పుడు తింటామన్నది కూడా చాలా ముఖ్యం.

మన ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని చాలా మంది తమ ఆహారంలో చేర్చుకుంటారు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే రోజంతా శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్‌ను ఎప్పుడు తింటామన్నది కూడా చాలా ముఖ్యం. సరైన సమయంలో తింటే వాటిలోని పోషకాలను శరీరం మరింత సమర్థవంతంగా గ్రహిస్తుంది. పోషకాహార నిపుణురాలు రిచా దోషి తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో డ్రై ఫ్రూట్స్‌ను సరైన సమయంలో తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎలా పెరుగుతాయో వివరించారు.
డ్రై ఫ్రూట్స్ తినడానికి సరైన సమయం
1. బాదం
బాదం తినడానికి ఉత్తమ సమయం ఉదయం. ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే ఎంతో మేలు చేస్తాయన్నారు. ముఖ్యంగా రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదం తింటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఇవి శరీర జీవక్రియను వేగవంతం చేయడంతో పాటు రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తాయి. అలాగే దృష్టి కేంద్రీకరణను కూడా మెరుగుపరుస్తాయి.
2. వాల్‌నట్స్
వాల్‌నట్స్‌ను సాయంత్రం సమయంలో తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మెలటోనిన్ ఉండటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే శరీరానికి విశ్రాంతిని కలిగించి నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి.
3. జీడిపప్పు
జీడిపప్పును మధ్యాహ్నం స్నాక్‌గా తీసుకోవడం ఉత్తమం. వీటిలో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. అయితే రాత్రి సమయంలో వీటిని తినడం మంచిది కాదు, ఎందుకంటే ఎక్కువ కొవ్వు, ప్రోటీన్ ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది.
4. పిస్తా పప్పులు
పిస్తాపప్పులు రోజులో ఎప్పుడైనా తినవచ్చు కానీ ఎక్కువగా మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో స్నాక్‌గా తీసుకోవడం మంచిది. వీటిలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.
View this post on Instagram
సరైన సమయంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
- శక్తి స్థాయిలు పెరుగుతాయి
- జీర్ణక్రియ మెరుగుపడుతుంది
- అనవసరమైన ఆకలి తగ్గుతుంది
- నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది
- రోజంతా సమతుల్యమైన ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి
మొత్తానికి ఆరోగ్యకరమైన ఆహారం అంటే కేవలం ఏమి తింటామనే విషయమే కాదు, దాన్ని ఎప్పుడు, ఎలా తింటామన్నదీ అంతే ముఖ్యమైనది. చిన్న చిన్న మార్పులు చేస్తే మన శరీరం ఆరోగ్యంగా ఉండటంలో పెద్ద మార్పు కనిపిస్తుంది.
