ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏంటో తెలుసా..? టాప్ 10 లిస్టులో హిందీ స్థానం ఎంతంటే..?

Most Spoken Languages: ఏడు ఖండాలు కలిగి ఉన్న ఈ భూమి మీద మొత్తం 200కు పైగా దేశాలు ఉండగా వాటిల్లో మొత్తం 7,000కు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలోనూ ఒక్కే భాష మాతృ భాషగా, జాతీయ అధికార భాషగా ఉంటుంటుంది. కాగా ఈ ఏడు వేల భాషల్లోనూ టాప్ 10 భాషలు ఏంటీ అనేది మీకు తెలిజేసే ప్రయత్నం చేద్దాం ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు మాట్లాడే..

ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏంటో తెలుసా..? టాప్ 10 లిస్టులో హిందీ స్థానం ఎంతంటే..?
Most Spoken Languages
Follow us
Sridhar Prasad

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Aug 04, 2023 | 5:11 PM

Most Spoken Languages: ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష ఏంటి..? మన భారత్‌కి చెందిన భాషలు ఏమైనా టాప్ 10 లిస్టులో ఉన్నాయా అని ఎప్పుడైనా ఆలోచించారా..? ఇప్పటివరకు ఆలోచించకపోయినా పర్వాలేదు.. ఇప్పుడు తెలుసుకుందాం రండి.. ఏడు ఖండాలు కలిగి ఉన్న ఈ భూమి మీద మొత్తం 200కు పైగా దేశాలు ఉండగా వాటిల్లో మొత్తం 7,000కు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలోనూ ఒక్కే భాష మాతృ భాషగా, జాతీయ అధికార భాషగా ఉంటుంటుంది. కాగా ఈ ఏడు వేల భాషల్లోనూ టాప్ 10 భాషలు ఏంటీ అనేది మీకు తెలిజేసే ప్రయత్నం చేద్దాం.. ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు మాట్లాడే భాష ఇంగ్లిష్. ప్రపంచంలో సుమారు 60కి పైగా దేశాల్లో 135కోట్లకు పైగా ప్రజలు ఈ భాషను మాట్లాడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఇంగ్లీష్ ని “యూనివర్శల్ లాంగ్వేజ్” అంటారు. ఈ భాష టాప్ వన్ లో ఉంది ఇదే సమయంలో.. చైనీస్‌ సంప్రదాయ భాష అయినా మాండరీన్‌ ను ప్రపంచ వ్యాప్తంగా 112 కోట్ల మంది మాట్లాడుతున్నారూ అని సమాచారం.చైనాతో పాటు తైవాన్‌, సింగపూర్‌ దేశాల్లో ఇది అధికార భాషగా ఉంది.

ఇక మూడో స్థానంలో మన భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ ఉంది. హిందీ భాషను ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60కోట్ల మంది మాట్లాడుతున్నారంట. మన దేశంలోనే కాకుండా పాకిస్థాన్‌, ఫిజీ దేశాల్లోనూ హిందీని అధికారిక భాషగా వ్యవహరిస్తున్నారు. ఇక నాలుగో స్థానంలో స్పెయిన్‌ దేశానికి చెందిన స్పానిష్‌ భాష కొనసాగుతోంది. 20కిపైగా దేశాల్లో ఇది అధికారిక భాషగా ఉంది. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 54కోట్ల మంది స్పానిష్‌ మాట్లాడుతున్నారని తెలుస్తుంది అంటున్నారు.ఇక ఐదోస్థానంలో 27కోట్ల మంది మాట్లాడే బాషా అరబిక్ ఉందని చరిత్ర చెబుతుంది. యూఏఈ ఇరాక్ ఒమాన్ కతార్ లిబియా సౌదీ అరేబియా సోమాలియా బహ్రెయిన్‌ ‌ సహా 22 దేశాల సమూహాన్ని అరబ్‌ ప్రపంచంగా పిలుస్తుంటారు. ఈ దేశాల అధికారిక భాష అరబిక్‌.

ఇవి కూడా చదవండి

అలాగే మన దేశంలోని పశ్చిమబెంగాల్‌ తోపాటు త్రిపుర, అస్సాం ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అదే విధంగా బంగ్లాదేశ్‌ అధికారిక భాషగా ఉన్న బెంగాలీ ఆరోస్థానంలో ఉంది. ఈ భాషను 26.8కోట్లు మంది మాట్లాడుతున్నారు. తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో ఫ్రెంచ్‌ అధికారిక భాషగా ఉన్న ఫ్రెంచ్‌ ను 26.7 కోట్ల మంది మాట్లాగా ఈ భాష ఏడో స్థానంలో ఉంది.తర్వాత రష్యా అధికారిక భాష అయిన రష్యన్‌ ను 25.8 కోట్ల మంది మాట్లాడుతుండటంతో ఇది ఎనిమిదో స్థానంలో నిలిచింది. అనంతరం 25.7 కోట్ల మంది మాట్లాడే భాషగా పోర్చుగల్‌ దేశ భాష పోర్చుగీసు ఉంది. ఆ దేశంలో కన్నా బ్రెజిల్‌, అంగోలా, మొజాంబిక్‌ దేశాల్లోని ప్రజలు ఎక్కువగా పోర్చుగీసులో మాట్లాడుతున్నారు కాగా దీని స్థానం తొమ్మిదిగా ఉంది. ఉర్దూ భాష టాప్ 10 ప్రపంచ భాషల్లో పదోస్థానంలో నిలిచింది. ఈ భాష లిపిని కూడా అరబిక్‌ లాగే కుడి నుంచి ఎడమకు రాస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉర్దూ మాట్లాడేవారు 23కోట్ల మంది ఉన్నారని సమాచారం. కాగా ప్రపంచ వ్యాప్తంగా 9.6కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడేవారున్నారని రికార్డ్స్ చెబుతున్నాయి.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..