Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venus Transit 2023: ఆగస్టు 7 నుంచి ఈ రాశులవారి పంట పండినట్లే.. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

Venus Transit 2023: జ్యోతిష్యంలో ప్రతి గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక సిరిసంపదలకు కారకుడైన శుక్రుడు ఆగస్టు 7న మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా రాశిచక్రంలోని కొన్ని రాశులవారు శుభఫలితాలను పొందుతారు. అలాగే ఈ సమయం ఆయా రాశులవారికి ఎంతో మంచి కాలంగా, లక్ష్మీకటాక్షాన్ని అనుగ్రహించేదిగా..

Venus Transit 2023: ఆగస్టు 7 నుంచి ఈ రాశులవారి పంట పండినట్లే.. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
Venus Transit 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 03, 2023 | 6:12 PM

Venus Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతులు మానవ జీవితాన్ని క్షణక్షణం ప్రభావితం చేస్తాయి. ఇంకా జ్యోతిష్యంలో ప్రతి గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక సిరిసంపదలకు కారకుడైన శుక్రుడు ఆగస్టు 7న మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా రాశిచక్రంలోని కొన్ని రాశులవారు శుభఫలితాలను పొందుతారు. అలాగే ఈ సమయం ఆయా రాశులవారికి ఎంతో మంచి కాలంగా, లక్ష్మీకటాక్షాన్ని అనుగ్రహించేదిగా ఉంటుంది. ఇంతకీ ఆ లక్కీ రాశులేమిటంటే..?

మేష రాశి: శుక్రుడు మిధునం నుంచి కర్కాటకంలోకి ప్రవేశించిన కారణంగా మేషరాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే వారసత్వంగా సిద్ధించే ఆస్తులను పొందుతారు. దాంపత్య సంతోషం, ఇతరులతో బంధాలు పెరుగుతాయి. మీ ఉద్యోగ జీవితం కూడా బాగుంటుంది.

మిధున రాశి: శుక్రుడు కర్కాటకంలోకి మిధునం నుంచే వెళ్లనున్నాడు. ఈ కారణంగా మిధునరాశివారికి కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. సంతాన, ధన ప్రాప్తిపొందుతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఉద్యోగం మారే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ధనస్సు రాశి: శుక్రగ్రహ కర్కాటక సంచారం కారణంగా ధనస్సు రాశివారు పోటీ పరీక్షల్లో నెగ్గుకొస్తారు. కలలు సాకారం అవుతాయి. ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి శుభవార్తలు వినిపిస్తాయి. కొత్త వెహికిల్‌ని కొనుగోలు చేస్తారు. ఇంకా వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు.

కర్కాటక రాశి: శుక్ర గ్రహ ప్రవేశం కారణంగా కర్కాటక రాశివారికి విద్యావ్యాపారాల్లో పురోగతి సిద్ధిస్తుంది. చురుగ్గా అన్ని పనులు పూర్తి చేసేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, సహకారం కూడా లభిస్తాయి.