AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీట్‌ కోచింగ్‌ సెంటర్‌లో విద్యార్ధి ఆత్మహత్య కలకలం.. ఈ ఏడాది 17 మంది సూసైడ్! అసలక్కడ ఏం జరుగుతోంది..?

దేశ వ్యాప్తంగా గత కొంతకాలంగా విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో స్టూడెంట్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్ధి రాసిన సూసైడ్‌ నోట్‌ ప్రతి ఒక్కరినీ కంటనీరు పెట్టిస్తోంది. సూసైట్‌ నోట్‌లో తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. రాజస్థాన్‌లోని కోటా నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

నీట్‌ కోచింగ్‌ సెంటర్‌లో విద్యార్ధి ఆత్మహత్య కలకలం.. ఈ ఏడాది 17 మంది సూసైడ్! అసలక్కడ ఏం జరుగుతోంది..?
NEET aspirant commits suicide
Srilakshmi C
|

Updated on: Aug 04, 2023 | 3:43 PM

Share

జైపూర్, ఆగస్టు 4: దేశ వ్యాప్తంగా గత కొంతకాలంగా విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో స్టూడెంట్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్ధి రాసిన సూసైడ్‌ నోట్‌ ప్రతి ఒక్కరినీ కంటనీరు పెట్టిస్తోంది. సూసైట్‌ నోట్‌లో తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. రాజస్థాన్‌లోని కోటా నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

రాజస్థాన్‌లోని కోటా సిటీలోని ఓ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నీట్‌ పరీక్షకు సిద్ధమవుతోన్న మంజోత్ సింగ్ (18) గురువారం (ఆగస్టు 3) తన హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్ధి గదిలోని గోడపై మూడు లెటర్లను అతికించాడు. సూసైడ్‌ నోట్‌లలో ఏముందంటే.. ‘సారీ’ అని ఓ నోట్‌లో రాశాడు. నేను నా ఇష్టాను సారంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారు. దయచేసి నా తల్లిదండ్రులు, స్నేహితులను ఇబ్బంది పెట్టవద్దని సూసైడ్‌కి ముందు మంజోత్‌ రాసిన మరో లెటర్‌లో పేర్కొన్నాడు. మూడో లెటర్‌లో ‘హ్యాపీ బర్త్ డే పాపా’ అంటూ రాశాడు. ఉన్నట్టుండి విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం చర్చణీయాంశంగా మారింది.

మంజోత్‌ తెలివైన విద్యార్థి అని, సరదాగా కలుపుగోలు తనంతో ఉండేవాడని తోటి స్నేహితులు పోలీసులకు చెప్పారు. మంజోత్‌ మెరిట్‌ స్టూడెంట్. 12వ తరగతిలో దాదాపు 93 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందాడు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించే సాధారణ పరీక్షలలో కూడా రాణించేవాడని వారు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన మంజోత్ సింగ్ మెడికల్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కోటాకు వచ్చిన మంజోత్‌ నీట్‌ పరీక్షకు సిద్ధం కావడానికి కోచింగ్ సెంటర్‌లో జాయిన్‌ అయ్యాడు. మంజోత్‌తోపాటు అతని స్కూల్‌ ఫ్రెండ్స్‌ మరో ముగ్గురు విద్యార్థులు కూడా కోటాలో జాయిలో అయ్యారు. వారంతా ఒకే హాస్టల్‌లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదుగానీ ఉన్నట్టుండి గురువారం ఉదయం తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న మంజోత్ మృతదేహం కనిపించింది. మంజోత్‌ చేతులు వెనక్కి కట్టి ఉన్నాయి. వెంటనే హాస్టల్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లలేదని, అతని కుటుంబ సభ్యులు వచ్చే వరకు వేచి చూస్తున్నామని పోలీసు అధికారి ధర్మవీర్ సింగ్ తెలిపారు. విద్యార్ధి ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదన్నారు. విద్యార్థి మృతిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతామని ఆయన అన్నారు.

కాగా కోటాలోని పలు కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది అక్కడ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన విద్యార్ధుల్లో మంజోత్‌ది 18వ మృతి కావడం అనుమానాలకు దారితీస్తోంది. ప్రస్తుతం నగరంలోని వివిధ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో రెండు లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నారు. గతేడాది కోటా సిటీలో వివిధ ఇన్‌స్టిట్యూట్‌లలో కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థుల్లో 15 మంది సూసైడ్‌ చేసుకుని మృతి చెందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.