- Telugu News Photo Gallery Cinema photos Bollywood Actress Malvika Raaj gets engaged to businessman Pranav Bagga, pics viral
ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు
చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన మాళవిక రాజ్ గుర్తుండే ఉంటుంది. 2001లో విడుదలైన సూపర్ హిట్ అయిన 'కభీ ఖుషీ కభీ ఘమ్' మువీలో పూజా పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి మాళవిక రాజ్. నటి మాళవిక రాజ్ తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ వ్యాపారవేత్త ప్రణవ్ బగ్గాతో పెళ్లికి సిద్ధమైపోయింది. తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్ టర్కీలో జరిగింది. తెల్లని వస్త్రధారణలో చూడముచ్చటగా ఉన్న ఈ జంటకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్..
Updated on: Aug 04, 2023 | 5:17 PM

చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన మాళవిక రాజ్ గుర్తుండే ఉంటుంది. 2001లో విడుదలైన సూపర్ హిట్ అయిన 'కభీ ఖుషీ కభీ ఘమ్' మువీలో పూజా పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి మాళవిక రాజ్.

నటి మాళవిక రాజ్ తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ వ్యాపారవేత్త ప్రణవ్ బగ్గాతో పెళ్లికి సిద్ధమైపోయింది. తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్ టర్కీలో జరిగింది. తెల్లని వస్త్రధారణలో చూడముచ్చటగా ఉన్న ఈ జంటకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తనకు ప్రియుడు ప్రణవ్ బగ్గా ప్రపోజ్ చేస్తున్న ఫోటోలను స్వయంగా ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా ఇద్దరు జంటగా దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఇన్‌స్టాలో మాళవిక రాస్తూ..'ఇప్పుడే మా ప్రయాణాన్ని ప్రారంభించాం. చాలా కాలం తర్వాత మాకు సమయం వచ్చింది. మా బంధం ఇంకా బలంగా ముందుకు సాగుతోంది..' అంటూ లవ్ సింబల్ ఎమోజీతోపాటు గోల్డ్ రింగ్ ఎమోజీని యాడ్ చేసింది. తమకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు అభిమానులు, స్నేహితులకు వెల్లడించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న సెలబ్రెటీలు, ఫ్యాన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఐతే మాళవిక, ప్రణవ్ పెళ్లి ఎప్పుడనే విషయం మాత్రం వెల్లడించలేదు.

ఇక సినిమాల విషయానికొస్తే.. దాదాపు 20 ఏళ్ల క్రితం కరణ్ జోహార్ తెరకెక్కించిన 'K3G' అనే మువీలో కరీనా కపూర్ ఖాన్ పాత్రను మాళవిక పోషించింది. ఈ సినిమాలో మాళవిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే 2017లో విడుదలైన జయదేవ్ మువీలో కూడా ఈ అమ్మడు నటించింది. కాగా మాళవిక ప్రముఖ బాలీవుడ్ నటుడు జగదీశ్ రాజ్ మనవరాలు. బాబీ రాజ్ కుమార్తె. ప్రముఖ నటి అనితా రాజ్‌కు ఆమె స్వయానా మేనకోడలు కూడా.




