- Telugu News Photo Gallery Cinema photos Prabhas reveals deepika padukone is his favourite actress know reason why
Tollywood News: ఆమే నా సూపర్‌స్టార్ అంటున్న ప్రభాస్.. బెదురులంక నుంచి దొంగోడే దొరగాడే పాట రిలీజ్..
రామ్, శ్రీలీల జంటగా నటించిన సినిమా స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి నీ చుట్టూ చుట్టూ అనే ఫస్ట్ సింగిల్ విడుదలైంది. రామ్ ఇందులో డబుల్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేస్తున్నారు శ్రీలీల. ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది స్కంద.
Updated on: Aug 04, 2023 | 5:58 PM

Ram Pothineni: రామ్, శ్రీలీల జంటగా నటించిన సినిమా స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి నీ చుట్టూ చుట్టూ అనే ఫస్ట్ సింగిల్ విడుదలైంది. రామ్ ఇందులో డబుల్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేస్తున్నారు శ్రీలీల. ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది స్కంద.

Dhanush: ప్రముఖ స్వరకర్త ఇళయరాజా బయోపిక్ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇళయరాజా కేరక్టర్‌లో ధనుష్ నటిస్తే బావుంటుందని అన్నారు ఆర్. బాల్కీ. ఇళయరాజా బయోపిక్ తెరకెక్కించడం తన డ్రీమ్ అని అన్నారు బాల్కీ. ధనుష్‌లో ఇళయరాజా పోలికలు కనిపిస్తాయని, అందుకే అతనితో సినిమా చేయాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

Prabhas: దీపిక పదుకోన్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ అని అన్నారు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కల్కి 2898ఎడి. ''దీపిక సెట్‌లోకి అడుగుపెడితే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఆమె ఇంటర్నేషనల్ కమర్షియల్స్ చేస్తున్నారు. ఆమెతో పనిచేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ఇప్పటికి కుదిరింది'' అని అన్నారు ప్రభాస్.

Ananya Pandey: ఇటీవల విడుదలైన సినిమా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ. ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్, ఆలియా జంటగా నటించారు. ఓ పాటలో అనన్య పాండే స్టెప్పులేశారు. హార్ట్ త్రోబ్ అనే ఆ సాంగ్‌ని షేర్ చేశారు అనన్య. తన జీవితంలో మర్చిపోలేని క్షణాలని అన్నారు. రణ్‌వీర్ డ్యాన్స్ చేసినట్టు, ఎవరూ చేయలేరని చెప్పారు. కరణ్‌తో పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు లైగర్ బ్యూటీ.

Bedurulanka: కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా బెదురులంక. ఈ చిత్రం నుంచి దొంగోడే దొరగాడే పాటను విడుదల చేశారు మేకర్స్. ప్రతి ఊరిలో, మతం పేరుతో మనుషుల్ని దోచుకునే మోసగాళ్లు ఉన్నారని చెప్పే పాట ఇది. మణిశర్మ సంగీతం అందించారు. త్వరలోనే ట్రైలర్‌ని, ఆగస్టు 25న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.




