Telangana: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా స్మగ్లింగ్ గోల్డ్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
నిందితుల్లో ఒకరు పోర్టబుల్ స్పీకర్, లైట్‌లో కొంత బంగారం దాచారు. మరొకరు ఇనుప పెట్టెలో బంగారాన్ని దాచినట్లు ఓ అధికారి తెలిపారు. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 132, 135, 104 సెక్షన్ల కింద వీరిద్దరిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో గోల్డ్ స్మగ్లర్స్ పట్టుబడటం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ అధికారుల కళ్లుగప్పి పలుమార్లు..
హైదరాబాద్, ఆగస్టు 6: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు శనివారం (ఆగస్టు 5) రూ. 1.12 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. ఇద్దరు ప్రయాణికులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. వీరు జెడ్డా నుంచి వస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితుల్లో ఒకరు పోర్టబుల్ స్పీకర్, లైట్‌లో కొంత బంగారం దాచారు. మరొకరు ఇనుప పెట్టెలో బంగారాన్ని దాచినట్లు ఓ అధికారి తెలిపారు. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 132, 135, 104 సెక్షన్ల కింద వీరిద్దరిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో గోల్డ్ స్మగ్లర్స్ పట్టుబడటం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ అధికారుల కళ్లుగప్పి పలుమార్లు కేటుగాళ్లు వివిధ మార్గాల్లో బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే.
మరో ఘటన..
భార్య పిల్లలను హత్య చేసి మృతదేహాలతో మూడు రోజుల పాటు గడిపి..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ అతని భార్య, ఇద్దరు కూతుళ్లను హతమార్చి, మృతదేహాలతో గత మూడు రోజులుగా అదే ఇంట్లో ఉంటున్నాడు. అపార్ట్‌మెంట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించగా అసలు విషయం బయటపడింది. వివరాల్లోకెళ్తే..
బెంగళూరులోని కడుగోడి పోలీస్ స్టేషన్‌లోని సీగేహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో టెక్కీ వీరార్జున విజయ్ (31), భార్య హేమావతి (29) దంపతులు కాపురం ఉంటున్నారు. వారికి ఏడాదిన్నర వయస్సున్న మోక్ష మేఘ నయన, 8 నెలల వయసున్న సునయన అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు టెక్కీ విజయ్ భార్య, పిల్లలను హత్య చేశాడు. అనంతరం మూడు రోజుల పాటు తన అపార్ట్మెంట్‌లో మృతదేహాలతోనే జీవనం సాగించాడు.
కుండలహళ్లిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్ లీడ్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం షేర్ల వ్యాపారంలోకి దిగి భారీగా నష్టపోయాడు. షేర్ వ్యాపారం చేస్తున్నాడని తెలిసిన భార్య హేమావతి, షేర్లలో ఇన్వెస్ట్ చేయవద్దని చెప్పినా అతను వినిపించుకోలేదు. ఈ విషయమై భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. చివరికి పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన విజయ్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ముందుగా భార్యపిల్లలను హతమార్చాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం వెలుగులోకొచ్చింది.
అతని ల్యాప్‌టాప్, మొబైల్‌ను పరిశీలించిన పోలీసులు ఈ మేరకు వెల్లడించారు. ముందుగా భార్యను గొంతు నులిమి హతమార్చినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. మరుసటి రోజు తన ఇద్దరు కూతుళ్లను హత్య చేశాడు. వారిని చంపిన మూడు రోజుల పాటు మృతదేహాలతో అపార్ట్‌మెంట్‌లోనే గడిపిన విజయ్ ఆ తర్వాత ఆగస్టు 2న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించాడు. అపార్ట్‌మెంట్ బెడ్ రూంలో నేలపై హేమావతి, చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. భార్య మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.