Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaddar Movies List: ప్రజా గాయకుడు గద్దర్ నటించిన సినిమాలు ఇవే.. ఆ పాటలు చాలా స్పెషల్!

చాలా మందికి  భుజాలపై వరకూ వేలాడే తెల్లజుట్టు, ఒంటిపై చొక్కాకూడా లేకుండా భుజంపై గొంగళి, గోచీ ధోతి, చేతిలో కర్రతో కనిపించే గద్దర్ మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఈ తరం వారికి గద్దర్‌ అంటే మదిలో మెదిలే రూపం దాదాపుగా ఇదే. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా ఆయన దాదాపు ఇదే గెటప్‌తో కనిపించేవారు. కానీ గద్దర్‌ మాజీ నక్సలైట్ అని, ఆయనో రాజకీయ నాయకుడు, సినీ నటుడు అని చాలా మందికి..

Gaddar Movies List: ప్రజా గాయకుడు గద్దర్ నటించిన సినిమాలు ఇవే.. ఆ పాటలు చాలా స్పెషల్!
Folk Singer Gaddar
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 06, 2023 | 6:30 PM

ప్రజాగొంతుక మూగబోయింది. తెలంగాణ ఉద్యమాల్లో తన పాటతో.. ఆటతో.. ఆడిపాడి ప్రజలను చైతన్య పరచిన గద్దర్‌ (74) ఆదివారం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మృతి చెందారు. గద్దర్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. గద్దర్ గొంతుక నుంచి వెలువడిన పాట ప్రజలకు పూనకాలు తెప్పించేవి. చాలా మందికి  భుజాలపై వరకూ వేలాడే తెల్లజుట్టు, భుజంపై గొంగళి, గోచీ ధోతి, చేతిలో కర్రతో కనిపించే గద్దర్ మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఈ తరం వారికి గద్దర్‌ అంటే మదిలో మెదిలే రూపం దాదాపుగా ఇదే. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా ఆయన దాదాపు ఇదే గెటప్‌తో కనిపించేవారు. కానీ గద్దర్‌ మాజీ నక్సలైట్ అని, ఆయనో రాజకీయ నాయకుడు, సినీ నటుడు అని చాలా మందికి తెలియదు. నటుడిగా ఆయన వెండితెరపై నటించి ఆడిపాడారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ.. ఆయన నటించిన సినిమాలను ఓ సారి గుర్తు చేసుకుందాం..

1984లో ‘రంగుల కల’ అనే సినిమాలో గద్దర్ తొలిసారి నటించారు. ఈ సినిమాలో యాదగిరి పాత్రలో ఆయన మొదటిసారి నటించారు. ఈ సినిమాలోని ‘బండెనక బండి కట్టి’ పాట ఆయనే రాసి ఆడి పాడారు. ఆ తర్వాత 1971లో ‘ఆపరా రిక్షా’ పాట పాడారు. ఆయన ఫస్ట్‌ ఆల్బం పేరు ‘గద్దర్’. ఈ ఆల్బం క్యాసెట్లు మార్కెట్లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఆయన పేరు గద్దర్‌గా మారిపోయింది. ‘ఒరేయ్ రిక్షా’ సినిమాలో ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’ పాట ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో చెప్పనవసరం లేదు. నేటికీ ఆ పాట జనాల నోళ్లలో నానుతూనే ఉంది. ఈ పాటకు నంది అవార్డు రాగా ఆయన దానిని తిరస్కరించారు.

జైబోలో తెలంగాణ సినిమాలో ‘పొడుస్తున్న పొద్దు మీద’ పాటకు థియేటర్లు దద్దరిల్లాయి. ఈ పాటకు నంది అవార్డు సైతం వచ్చింది. అలాగే ఆయన రాసి పాడిన ‘అమ్మా తెలంగాణ ఆకలికేకల గానమా’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర సర్కార్‌ ఎంపిక చేసింది.

ఇవి కూడా చదవండి

2016లో దండకారణ్యం మువీ, 2022లో విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’ లో గద్దర్ కీలక పాత్రలో కనిపించారు. గద్దర్ చివరిసారిగా ‘ఉక్కు సత్యాగ్రాహం’ అనే సినిమాలో కనిపించారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.