గుండెపోటుతో ప్రముఖ హీరో భార్య మృతి.. విహారయాత్రలో ఉండగా విషాదం!

బ్యాంకాక్‌ ట్రిప్‌కు వెళ్లిన విజయ్‌ రాఘవేంద్ర దంపతులు కుమారుడు శౌర్యను తమ్ముడి వద్ద వదిలి వెళ్లాడు. ఈ ఘటన జరిగిన సమయంలో స్పందన తన స్నేహితులు, ఫ్యామిలీతో కలిసి థాయ్‌లాండ్ హాలీడే వెకేషన్‌లో ఉన్నారు. విజయ్ రాఘవేంద్ర ప్రస్తుతం తన అప్‌కమింగ్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు స్పందన భౌతికకాయాన్ని బెంగళూరుకు తీసుకు వచ్చేందుకు ఆమె తండ్రీ, సోదరుడు బ్యాంకాక్‌కు బయలుదేరినట్టు..

గుండెపోటుతో ప్రముఖ హీరో భార్య మృతి.. విహారయాత్రలో ఉండగా విషాదం!
Vijay Raghavendra's Wife Spandana
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 07, 2023 | 7:30 PM

ప్రముఖ కన్నడ హీరో విజయ్‌ రాఘవేంద్ర ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన సోమవారం (ఆగస్టు 7) ఉదయం మృతి చెందారు. హాలిడేస్‌ ఎంజాయ్‌ చేయడానికి విజయ్‌ రాఘవేంద్ర దంపతులు స్నేహితులతో కలిసి ఇటీవల బ్యాంకాక్‌ విహారయాత్రకు వెళ్లారు. విహారయాత్ర సమయంలో స్పందన గుండెపోటుతో మృతి చెందారు. లోబీపీ కారణంగా ఆమెకు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు స్పందన మృతి చెందిన విషయాన్ని విజయ్‌ రాఘవేంద్ర తమ్ముడు శ్రీమురళి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘మేము షాక్‌లో ఉన్నాం. పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. రేపు నా సోదరుడు స్పందన మృతదేహాన్ని తీసుకుని ఇక్కడికి వస్తాడని శ్రీమురళి తెలిపాడు. ప్రస్తుతం మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోందని, ఈ రోజు సాయంత్రానికి పూర్తి వివరాలు తెలుస్తాయని స్పందన స్నేహితురాలు ఒకరు మీడియకు తెలిపారు. మరోవైపు స్పందన మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి విజయ్‌ బ్యాంకాక్‌ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నారు.

బ్యాంకాక్‌ ట్రిప్‌కు వెళ్లిన విజయ్‌ రాఘవేంద్ర దంపతులు కుమారుడు శౌర్యను తమ్ముడి వద్ద వదిలి వెళ్లాడు. ఈ ఘటన జరిగిన సమయంలో స్పందన తన స్నేహితులు, ఫ్యామిలీతో కలిసి థాయ్‌లాండ్ హాలీడే వెకేషన్‌లో ఉన్నారు. విజయ్ రాఘవేంద్ర ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు స్పందన భౌతికకాయాన్ని బెంగళూరుకు తీసుకు వచ్చేందుకు ఆమె తండ్రీ, సోదరుడు బ్యాంకాక్‌కు బయలుదేరినట్టు సమాచారం. రేపు బెంగళూరులో స్పందన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంతాపం తెలుపుతూ ట్వీట్‌ చేశారు. కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన అకాల మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. స్పందన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు. విజయ రాఘవేంద్ర, బికె శివరామ్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా మృతురాలు స్పందన రిటైర్డ్ పోలీసు అధికారి బికె శివరామ్ కుమార్తె. ఎప్పుడూ సినిమాల్లో నటించకపోయనప్పటికీ సొంతంగా హోమ్ ప్రొడక్షన్ కిస్మత్‌ని ఏర్పాటు చేశారు. తన నిర్మాణ సంస్థపై పలు మువీలను రూపొందించారు. ఆమె సోదరుడు రక్షిత్ శివరామ్ (39) ఇటీవల బెల్తంగడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆగస్టు 26న ఈ జంట 16వ వివాహ వార్షికోత్సవానికి ముందు ఈ సంఘటన చోటుచేసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..