Niharika Konidela: ‘నువ్వు మా జీవితాల్లో వెలుగులు నింపావ్.. హ్యాపీ బర్త్ డే బాబు’.. నిహారిక పోస్ట్‌ వైరల్‌..

డెడ్ పిక్సల్ అనే వెబ్ సిరీస్ తో నటిగా రీఎంట్రీ ఇచ్చిన నిహారిక... మరోవైపు తన స్నేహితులతో కలిసి వెకేషన్స్ వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. అక్కడ తన ఫ్రెండ్స్ తో గడిపే ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఎక్కువగా గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తుంది నిహారిక. అలాగే జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ ఫిట్ నెస్ పై మరింత ఫోకస్ పెట్టింది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది.

Niharika Konidela: 'నువ్వు మా జీవితాల్లో వెలుగులు నింపావ్.. హ్యాపీ బర్త్ డే బాబు'.. నిహారిక పోస్ట్‌ వైరల్‌..
Niharika Konidela
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 07, 2023 | 3:58 PM

కొద్ది రోజులుగా మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు నిత్యం వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జొన్నలగడ్డ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరలవుతుంది. విడాకులు అనౌన్స్ చేయకముందే వీరు తమ ఇన్ స్టా ఖాతాలలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకోవడం.. పెళ్లి ఫోటోస్ డెలీట్ చేయడంతో డివోర్స్ రూమర్స్ బయటకు వచ్చాయి. దీంతో చాలా కాలం మౌనంగా ఉన్న వీరిద్దరు విడాకుల గురించి అఫీషియల్ గా చెప్పేశారు. తామిద్దరం పరస్పరం అంగీకారంతోనే విడిపోతున్నామని.. తమ ప్రైవసీకి ఇబ్బందిపెట్టవద్దంటూ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వీరిద్దరి సోషల్ మీడియా ఖాతాలపై.. పర్సనల్ విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్స్. ముఖ్యంగా విడాకుల విషయంలో నిహారిక పై నెట్టింట నెగిటివిటీని, ట్రోల్ జరుగుతున్నా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇటీవలే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన నిహారిక (Niharika Konidela).. అటు వెబ్ సిరీస్, మూవీస్ చేస్తూ బిజీ అవుతున్నారు.

డెడ్ పిక్సల్ అనే వెబ్ సిరీస్ తో నటిగా రీఎంట్రీ ఇచ్చిన నిహారిక… మరోవైపు తన స్నేహితులతో కలిసి వెకేషన్స్ వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. అక్కడ తన ఫ్రెండ్స్ తో గడిపే ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఎక్కువగా గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తుంది నిహారిక. అలాగే జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ ఫిట్ నెస్ పై మరింత ఫోకస్ పెట్టింది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు కాలభైరవ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా నిహారిక అతడికి బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

“హ్యాపీ బర్త్ డే బాబు.. నువ్వే మా జీవితాల్లో వెలుగును తీసుకొచ్చావ్. థాంక్స్.. లెట్స్ హ్యావ్ ఫన్ డే” అని రాసుకొస్తూ.. అతడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. కాలభైరవకు ఇష్టమైన పాటను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. నిహారిక.. కాలభైరవ బెస్ట్ ఫ్రెండ్స్. చిన్ననాటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే..  ఇప్పుడు నిహారిక తన ఫిల్మ్ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఓవైపు ఇండస్ట్రీలో నిర్మాతగా రాణిస్తూనే.. మరోవైపు నటిగా మరోసారి బిజీ కానుంది.

నిహారిక ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.