- Telugu News Photo Gallery Cinema photos Tollywood Updates on 07 08 2023 in Film industry Telugu Entertainment Photos
Entertainment: మొదలైన భోళా సందడి.. సెట్‌లో పుష్ప రూల్ | డెవిల్ డేట్ ఫిక్స్..
షారూఖ్ ఖాన్ కూతురు సుహానాను వెండితెరకు పరిచయం చేసే బాధ్యత కరణ్ జోహార్ తీసుకున్నారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా తెలుగు వర్షన్ సెన్సార్ పూర్తయ్యింది. కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ స్పై థ్రిల్లర్ డెవిల్. ఈ రోజు నుంచి పుష్ప 2 కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు కీలక పాత్రధారులు పాల్గొంటున్నారు.
Updated on: Aug 07, 2023 | 4:22 PM

షారూఖ్ ఖాన్ కూతురు సుహానాను వెండితెరకు పరిచయం చేసే బాధ్యత కరణ్ జోహార్ తీసుకున్నారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా తెలుగు వర్షన్ సెన్సార్ పూర్తయ్యింది. కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ స్పై థ్రిల్లర్ డెవిల్. ఈ రోజు నుంచి పుష్ప 2 కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.

శిల్ప కళా వేదికలో భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ అంతా పాల్గొన్నరు.. ఈ ఈవెంట్ టీవీ 9లో ఎక్స్‌క్లూజివ్‌గా లైవ్ టెలికాస్ట్ అయ్యింది.. చిరంజీవి హీరోగా తెరకెక్కిన భోళా శంకర్ సినిమాకు మెహర్ రమేష్ దర్శకుడు.

ఈ రోజు నుంచి పుష్ప 2 కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు కీలక పాత్రధారులు పాల్గొంటున్నారు. తొలి భాగం సూపర్ హిట్ కావటంతో సీక్వెల్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్.

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా తెలుగు వర్షన్ సెన్సార్ పూర్తయ్యింది. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు యు బై ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ స్పై థ్రిల్లర్ డెవిల్. నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేశారు మేకర్స్. నవంబర్ 24న డెవిల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతమందిస్తున్న ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

షారూఖ్ ఖాన్ కూతురు సుహానాను వెండితెరకు పరిచయం చేసే బాధ్యత కరణ్ జోహార్ తీసుకున్నారు. ఇప్పటికే సుహాన నటించిన వెబ్ సిరీస్ ది ఆర్చీస్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సుహాన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సంబంధించిన డిస్కషన్ మొదలైంది. కరణ్ స్వీయ దర్శకత్వంలో సుహానాను పరిచయం చేయబోతున్నారు.





























