IIT Hyderabad Student Suicides: ఐఐటీ హైదరాబాద్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్య.. గదిలో సూసైడ్ లెటర్ లభ్యం!

ఐఐటీ హైదరాబాద్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్‌ గదిలో సూసైడ్‌ లెటర్‌ రాసి ప్రాణాలు తీసుకుంది. సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్‌ ఐఐటీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతోన్న విద్యార్థిని మమైత (20) నాయక్‌ మంగళవారం (ఆగస్టు 8) ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌లోని తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని విగత జీవిగా కనిపించింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన విద్యార్ధిని మమైత ఐఐటీ క్యాంపస్‌లో ఎంటెక్‌..

IIT Hyderabad Student Suicides: ఐఐటీ హైదరాబాద్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్య.. గదిలో సూసైడ్ లెటర్ లభ్యం!
IIT Hyderabad
Follow us
P Shivteja

| Edited By: Srilakshmi C

Updated on: Aug 08, 2023 | 12:37 PM

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 8: ఐఐటీ హైదరాబాద్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్‌ గదిలో సూసైడ్‌ లెటర్‌ రాసి ప్రాణాలు తీసుకుంది. సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్‌ ఐఐటీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతోన్న విద్యార్థిని మమైత (20) నాయక్‌ మంగళవారం (ఆగస్టు 8) ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌లోని తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని విగత జీవిగా కనిపించింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన విద్యార్ధిని మమైత ఐఐటీ క్యాంపస్‌లో ఎంటెక్‌ చదువుతోంది. ఆమె జూలై 26న క్యాంపస్‌కు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఏం జరిగిందో తెలియదుగానీ ఒరియా భాషలో సూసైడ్‌ లెటర్‌ రాసి బలవణ్మరణానికి పాల్పడింది. హాస్టల్‌ సిబ్బంది సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిలోని సూసైడ్‌ లెటర్‌ స్వాధీనం చేసుకుని, విద్యార్ధిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సంగారెడ్డి డీఎస్పీ పి రమేశ్‌కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మమైత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువులో ఒత్తిడికి గురి కావడం వల్లనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. చదువులో ఒత్తిడి తట్టుకోలేకే చనిపోతున్నానని మమైతా సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఓ పోలీసధికారి తెలిపారు.

కాగా సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. తాజాగా మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఐఐటీ విద్యార్థుల వరుసగా ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. 2022-23 ఏడాది వ్యవధిలోనే నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. చదువులు చదవలేక, ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు తనువుచాలిస్తున్నారు. మరికొంతమంది విద్యార్ధులు పరీక్షల్లో ఫెయిల్ అవ్వడాన్ని జీర్ణించుకోలేక చావే శరణ్యమని భావిస్తున్నారు. చిన్న సమస్యలకే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

2022లో ఐఐటీ హైదరాబాద్ విద్యార్ధుల ఆత్మహత్యలు ఇవే..

  • గతేడాది ఆగస్టు 31న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాకు చెందిన విద్యార్థి రాహుల్ మంచానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
  • అదే సంవత్సరం సెప్టెంబర్ 6న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కి చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి మేగ్ కపూర్ సంగారెడ్డిలో ఓ హోటల్‌పై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
  • జులై 17వ తేదీన క్యాంపస్ నుంచి బయటికి వెళ్లిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ వైజాగ్‌లో శవమై తేలాడు.
  • ఈ రోజు అంటే ఆగస్టు 8వ తేదీన (మంగళవారం) ఒడిషాకి చెందిన విద్యార్థిని మమైతా నాయక్ క్యాంపస్‌ హాస్టల్‌ రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కాగా ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతోన్న ఘటనలు తల్లిదండ్రుల్లో గుబులురేపుతున్నాయి. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లోనే విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తమ పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గడచిన ఐదేళ్లలో ఐఐటీల్లో ఎంతమంది విద్యార్ధులు సూసైడ్‌ చేసుకున్నారంటే..

2018 నుంచి 2023 మధ్యకాలంలో దాదాపు 39 మంది ఐఐటీ విద్యార్ధులు దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించారు. సెంట్రల్‌ యూనివర్సిటీల్లో 25 మంది, ఎన్‌ఐటీల్లో 25 మంది, ఐఐఎమ్‌లలో నలుగురు, ఐఐఎస్‌ఈఆర్‌లో ముగ్గురు, ట్రిపుల్‌ఐటీల్లో ఇద్దరు చొప్పున విద్యార్ధులు సూసైడ్‌ చేసుకున్నారు. గత ఐదేళ్లలో మొత్తం 98 మంది విద్యార్ధులు వివిధ ఉన్నత విద్యాసంస్థల్లో సూసైడ్‌ చేసుకుని మరణించినట్లు ఇటీవల కేంద్ర విద్యాశాఖ రాజ్యసభలో వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.