E-auction HMDA: భూముల వేలం- సర్కారుకు కాసుల వర్షం సరే.. మరి సామాన్యుడికి అందేనా..?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో లేఅవుట్లను డెవలప్ చేసి హెచ్ఎండిఏ వరుసగా వాటి అమ్మకాన్నే చేపట్టింది. కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లో ఏకంగా ఎకరం 100 కోట్ల రూపాయలు ధర పలకగా... తాజాగా మోకిలా వద్ద అమ్మకానికి పెట్టిన భూముల్లో ఒక గజం ధర 1,05,000 పలికింది. 15,800 గజాల స్థలానికి మొత్తం 40 కోట్ల రూపాయలు అప్సెట్ ప్రైస్ గా హెచ్ఎండిఏ నిర్ణయిస్తే 121 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది.
భూముల అమ్మకం హెచ్ఎండిఏ కు కాసుల వర్షం కురిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో లేఅవుట్లను డెవలప్ చేసి హెచ్ఎండిఏ వరుసగా వాటి అమ్మకాన్నే చేపట్టింది. కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లో ఏకంగా ఎకరం 100 కోట్ల రూపాయలు ధర పలకగా… తాజాగా మోకిలా వద్ద అమ్మకానికి పెట్టిన భూముల్లో ఒక గజం ధర 1,05,000 పలికింది. 15,800 గజాల స్థలానికి మొత్తం 40 కోట్ల రూపాయలు అప్సెట్ ప్రైస్ గా హెచ్ఎండిఏ నిర్ణయిస్తే 121 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. దీంతో రెండవ దశలో మరిన్ని ప్లాట్లను వేలం వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది హెచ్ఎండిఏ.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని భూముల అమ్మకం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి కాసుల వర్షం కురిపిస్తుంది. వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రాణాలికలు రచించిన ప్రభుత్వం అందుకు అవసరమైన నిధుల సేకరణ కోసం ప్రభుత్వ భూములను అమ్మాలని డిసైడ్ చేసింది. అందులో భాగంగా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా లేఅవుట్లు ఏర్పాటు చేసి వాటిని అమ్మకానికి పెట్టింది. ప్రభుత్వ సంస్థ రూపొందించిన లేఅవుట్ కావడం భూములు క్లియర్ టైటిల్ ఉండడంతో చాలామంది వాటిని కొనుగోలుకు ఆసక్తి చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం కోకాపేట్ గండిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న హెచ్ఎండిఏ నియో పోలీస్ లేఔట్ లో 45 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. ఇందులో ఆల్టైమ్ రికార్డు గా ఒక ఎకరం ధర 100 కోట్లు పలకడం విశేషం. ఇక్కడ మొత్తం 1500 కోట్ల రూపాయలు అప్సెట్ ప్రైస్ గా నిర్వహించగా 3319 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. దాంతో సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు రూపొందిస్తూ వాటిని అమ్మకానికి పెట్టింది హెచ్ఎండిఏ.
తాజాగా నగర శివారు ప్రాంతంలో ఉన్న మోకిలా వద్ద 165.37 ఎకరాల్లో లేఅవుట్ ప్లాన్ చేసింది హెచ్ఎండిఏ. ఇందులో మొత్తం 1321 ప్లాట్లకు గాను మొదటి పేజీలో 50 ప్లాట్ లను వేలానికి పెట్టింది. ఇక్కడ ఏర్పాటుచేసిన లేఔట్ మొత్తం రెసిడెన్షియల్ యూస్ కోసం ఉపయోగించాలని నిర్ణయించారు అధికారులు. ఇందులో ఒక ప్లాట్ 300 నుండి 500 గజాల వరకు ఏర్పాటు చేశారు. గజానికి 25 వేల రూపాయలు అప్సెట్ ప్రైస్ గా హెచ్ఎండిఏ నిర్ణయించింది. మొత్తం 50 ప్లాట్లలో 15800 గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టిన హెచ్ఎండిఏ అధికారులు 40 కోట్ల రూపాయలు అప్సెట్ ప్రైస్ గా నిర్ణయించారు. కానీ ఏకంగా 121 కోట్ల 40 లక్షల రూపాయలు ఆదాయం హెచ్ఎండిఏకు చేరింది.
ఇక మోకిలా వద్ద అత్యధికంగా గజం ధర 1, 05,000 పలికింది. ఈ ప్రాంతంలో ఇంత ధర రావడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రియల్ వ్యాపారులు. అత్యల్పంగా గజం ధర 72 వేల రూపాయలు పలికింది. ఇలా సరాసరిగా మోకిలా వద్ద హెచ్ఎండిఏ రూపొందించిన లే అవుట్ లో 80,397 రూపాయలకు గజం భూమి అమ్ముడు పోయింది. ప్రభుత్వం ఆశించిన దాని కంటే మూడు రేట్లు ఎక్కువ ధర రావడం తో హెచ్ఎండిఏ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక ఈనెల 10వ తేదీన బుద్వేల్ వద్ద ప్లాన్ చేసిన లేఅవుట్లో 100 ఎకరాలను అమ్మేందుకోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.. ఇలా మొత్తం 100 ఏకరాలను అమ్మకానికి పెట్టిన హెచ్ఎండిఏ ఏకరాకు 20 కోట్ల చోప్పున అప్ సేట్ ప్రైస్ నిర్ణయించింది. మొత్తం 14 ప్లాట్లుగా విభజించిన అధికారులు ఈనెల 10వ తేదీన ఆన్లైన్ వేలం వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేలం పాటను కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఎంఎస్ టిసి లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తుంది. ప్రతి ఎకరాకు 20 కోట్ల రూపాయలు అప్సెట్ ప్రైస్ గా నిర్ణయించినది హెచ్ఎండిఏ. మొత్తంగా 2000కోట్లు ఆప్ సెట్ ప్రైస్ కాగా మూడున్నర నుండి 4 వేల కోట్ల వరకు ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..