Health Tips: మధుమేహం గుండె జబ్బులను కలిగిస్తుందా? తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు..

మధుమేహం, గుండె జబ్బులకు మధ్య సన్నిహిత సంబంధని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. డయాబెటిస్ నిర్ధారన అయినప్పుడు, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. కార్డియోవాస్కులర్ డిసీజ్(CVD), కరోనరీ ఆర్టరీ వ్యాధి గుండెపోటు, స్ట్రోక్‌లకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. కాలక్రమేణా అనియంత్రిత మధుమేహం గుండె జబ్బులకు..

Health Tips: మధుమేహం గుండె జబ్బులను కలిగిస్తుందా? తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు..
Diabetic Heart Disease
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 06, 2023 | 11:58 AM

మధుమేహం వల్ల గుండె సంబంధిత రుగ్మతలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో భారతదేశంలో ఈ కేసులు భారీగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 30 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వారిలో పెద్ద సంఖ్యలో మధుమేహంతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, మధుమేహం, గుండె జబ్బులకు మధ్య సన్నిహిత సంబంధని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. డయాబెటిస్ నిర్ధారన అయినప్పుడు, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. కార్డియోవాస్కులర్ డిసీజ్(CVD), కరోనరీ ఆర్టరీ వ్యాధి గుండెపోటు, స్ట్రోక్‌లకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. కాలక్రమేణా అనియంత్రిత మధుమేహం గుండె జబ్బులకు దారి తీస్తుంది.

మధుమేహం వల్ల గుండె సమస్యలు..

రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం పెరగడం వల్ల శరీరమంతా రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలు, ధమనులు, సిరలు దెబ్బతింటాయని నిపుణులు వివరిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు రక్త నాళాలు కుంచించుకుపోతాయి. గుండెకు రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. ఈ పరిస్థితిని అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే, శరీరంలో అధిక రక్తంలో చక్కెర స్థాయిలు వాపునకు దారితీస్తాయి. గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. అందుకే, మధుమేహ వ్యాధిగ్రస్తులు గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మధుమేహాన్ని నిర్వహించడం, హృదయాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.

రెగ్యులర్ చెక్-అప్‌లు చేయించుకోవాలి..

ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. గుండె సమస్యలను నివారించడానికి షుగర్ లెవల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా అవసరం. రోజూ ఇంట్లోనే బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ చేక్ చేసుకుని డాక్టర్ సూచించిన మేరకు మెడిసిన్స్ వినియోగించాలి.

ఇవి కూడా చదవండి

రోజూ వ్యాయామం చేయాలి..

సరైన ఫిట్‌నెస్ నిర్వహించాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, గుండె సమస్యల నుంచి సేఫ్‌గా ఉండటానికి వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, వెయిట్ ట్రైనింగ్, ఏరోబిక్స్ వంటి కార్యకలాపాలు చేయాలి.

పోషకాహారాలు..

మంచి ఆరోగ్యం కోసం అవసరమైన పోషకాలను తీసుకోవాలి. సమతుల ఆహారం తినాలి. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్, క్యాన్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

ధూమపానం, మద్యపానం మానుకోవాలి..

గుండె ఆరోగ్యంగా ఉండటానికి ధూమపానం, మద్యపానం మానేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ధూమపానం, మద్యం సేవించడం వలన గుండె మాత్రమే కాకుండా మొత్తరం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..