- Telugu News Photo Gallery Way of Drinking Water: Don't drink water in these three situations says health experts
Health News: ఈ మూడు సందర్భాల్లో నీళ్లు తాగకూడదు? హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న కీలక విషయాలు మీకోసం..
శరీర ఆరోగ్యానికి ఆహారంతో పాటు నీరు కూడా అవసరం. జీవక్రియను నిర్వహించడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజుకు 2 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ కొన్ని పరిస్థితులలో నీటిని తాగకూడదని కూడా హెచ్చరిస్తున్నారు.
Updated on: Aug 07, 2023 | 6:20 AM

శరీర ఆరోగ్యానికి ఆహారంతో పాటు నీరు కూడా అవసరం. జీవక్రియను నిర్వహించడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజుకు 2 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ కొన్ని పరిస్థితులలో నీటిని తాగకూడదని కూడా హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు కనీసం 2 లీటర్ల స్వచ్ఛమైన నీటిని తాగడం చాలా అవసరం. అయితే ఈ మూడు సందర్భాల్లో నీళ్లు తాగకూడదు. ఆ మూడు పరిస్థితులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పడుకునే ముందు: నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి పడుకునే ముందు నీరు తాగకూడదు. రాత్రిపూట మూత్రపిండాల పనితీరు మందగించడమే దీనికి కారణం. ఈ సమయంలో శరీరంలో నీరు ఎక్కువగా ఉంటే ముఖం వాపు వచ్చే అవకాశం ఉంది.

వ్యాయామం: వ్యాయామం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో నీరు తాగితే శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పులు వచ్చి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకని వ్యాయామం చేసిన తర్వాత 20-25 నిమిషాల పాటు నీళ్లు తాగకపోవడమే మంచిది.

భోజన సమయం: భోజనానికి అరగంట ముందు స్వచ్ఛమైన నీరు త్రాగాలి. లేదంటే శరీరంలోని జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. ఫలితంగా పేగుల పనితీరు మందగించి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తిన్న వెంటనే నీరు తాగకూడదు, కొన్ని నిమిషాల తర్వాత తాగడం మంచిది.

శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం కూడా మంచిది కాదు. ఎక్కువ నీరు త్రాగడం వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, మూత్రపిండాల పనితీరుపై చెడు ప్రభావం ఉంటుంది.





























