- Telugu News Photo Gallery These signs tell that you are not in a relationship but in a situation relationship, know all details here
Relationship Tips: ట్రెండింగ్‌లో సిట్యుయేషన్ రిలేషన్‌షిప్.. మీ బంధం కూడా ఇలాంటిదేనా?
ప్రేమ, అనుబంధం, సంబంధం, లివ్ ఇన్ రిలేషన్‌షిప్ వంటి పదాలు బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటి గురించి తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. అలాగే, ప్రస్తుతం ఈ సంబంధాలతో పాటు.. సిట్యుయేషన్‌షిప్ ట్రెండ్ జోరందుకు. మరి దీని అర్థమేంటి? మీ భాగస్వామితో మీకు ఉన్న రిలేషన్ ఎలాంటిది? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Updated on: Aug 06, 2023 | 11:00 AM

ప్రేమ, అనుబంధం, సంబంధం, లివ్ ఇన్ రిలేషన్‌షిప్ వంటి పదాలు బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటి గురించి తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. అలాగే, ప్రస్తుతం ఈ సంబంధాలతో పాటు.. సిట్యుయేషన్‌షిప్ ట్రెండ్ జోరందుకు. మరి దీని అర్థమేంటి? మీ భాగస్వామితో మీకు ఉన్న రిలేషన్ ఎలాంటిది? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉన్నా, మీ భాగస్వామితో ఉన్న సంబంధానికి ఇప్పటికీ పేరు పెట్టలేకపోతే.. అది సిట్యుయేషన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. అంటే.. పరిస్థితుల ప్రభావంతో బంధంలో ఉన్నారని అర్థం.

మీరు మీ భాగస్వామికి చాలా దగ్గరగా ఉంటారు. కానీ, అన్ని భావోద్వేగాలను వారితో పంచుకోలేరు. మనసు విప్పి మాట్లాడలేరు. భవిష్యత్ గురించి చర్చించలేరు. ఇదే సిట్యూయేషన్ రిలేషన్‌షిప్.

మీరు, మీ భాగస్వామి చాలా కాలంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కానీ, ప్రతీది పంచుకోవడం గానీ, అధికారికంగా మీ సంబంధాన్ని అంగీకరించడానికి గానీ భయపడతారు. ఇది కూడా మీరు సిట్యుయేషన్ రిలేషన్‌షిప్.

మీ స్నేహితులు, బంధువులు ఏ పరిస్థితిలోనైనా మిమ్మల్ని జంటగా గుర్తించలేకపోతే, అది కూడా సిట్యుయేషన్ రిలేషన్‌షిప్‌కు సంకేతం. తరచుగా వ్యక్తులు సంబంధాన్ని ఎక్కువగా ఇతరులకు తెలియకుండా దాచి పెడతారు. బహిర్గతం కానివ్వరు. దీనినే సిట్యూయేషన్ రిలేషన్‌షిప్ అంటారు.

మీరు ఒంటరిగా జీవిస్తున్నప్పుడు మీ భాగస్వామి మీకు ప్రాముఖ్యతనిస్తారు. కానీ, మీరిద్దరూ కలిసి ఒక కార్యక్రమం, సమావేశానికి వెళ్లాక.. అక్కడ ఒకరికొకరు తెలియనట్లు ఉంటే.. అది కూడా సిట్యూయేషన్ రిలేషన్‌షిప్‌కు నిదర్శనం.

సిట్యుయేషన్ రిలేషన్‌షిప్‌లో తమ మధ్య రిలేషన్ ఏంటో చెప్పలేరు, ఈ సంబంధంలో బాధ్యత కూడా ఉండదు. ఇది నిబద్ధత లేని సంబంధం. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది. కానీ, దానికి భవిష్యత్ ఉండదు. అదే సిట్యుయేషన్ రిలేషన్‌షిప్.





























