Gold Demand: పసిడిపై భారత వనితల మోజు తగ్గుతోందా? లెక్కలు చెబుతున్న షాకింగ్ విషయాలు..!
శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు హాజరైతే.. ఆ సోయగం, ఆ ఠీవీనే వేరుగా ఉంటుంది. చుట్టుపక్కన వారంతా వారి వైపు చూడాల్సిందే. సందర్భం ఏదైనా బంగారం కొనుగోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతారు మన భారతీయ మహిళలు. అతివలే కాదు.. మగమహారాజులు కూడా బంగారు ఆభరణాలపై ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. కొందరైతే ఒంటిపై ధరించే డ్రెస్సులను కూడా బంగారంతో చేయించుకున్న పరిస్థితులు ఉన్నాయి. గోల్డ్ మెన్ పేరుతో చాలా మంది దేశ వ్యాప్తంగా..
Gold Demand: ప్రపంచ వ్యాప్తంగా బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడేది ఇండియన్స్ అని టకీమని చెప్పొచ్చు. బంగారం అంటే మన దేశ అతివలకే కాదు, పురుషులకూ మక్కువ ఎక్కువ. ఒంటి నిండా బంగారం ఆభరణాలు ధరించి, శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు హాజరైతే.. ఆ సోయగం, ఆ ఠీవీనే వేరుగా ఉంటుంది. చుట్టుపక్కన వారంతా వారి వైపు చూడాల్సిందే. సందర్భం ఏదైనా బంగారం కొనుగోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతారు మన భారతీయ మహిళలు. అతివలే కాదు.. మగమహారాజులు కూడా బంగారు ఆభరణాలపై ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. కొందరైతే ఒంటిపై ధరించే డ్రెస్సులను కూడా బంగారంతో చేయించుకున్న పరిస్థితులు ఉన్నాయి. గోల్డ్ మెన్ పేరుతో చాలా మంది దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన వారు ఉన్నారు.
అయితే, ఇప్పుడు పరిస్థితి తారమరవుతోంది. తాజాగా లెక్కలు బంగారం బిక్కమొహం వేసుకుంటున్నట్లు చూపుతున్నాయి. పసిడిని చూసి పక్కకు జరిగిపోతున్నారట. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో గోల్డ్ డిమాండ్ ఏకంగా 7 శాతం క్షీణించింది. ఇది మేం చెబుతున్న ముచ్చట కాదు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(WGC) తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెప్తున్న పచ్చి నిజం.
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుల దేశంగా భారతదేశం ఉంది. అయితే, ఇప్పుడు మన దేశంలో బంగారం డిమాండ్ క్రమంగా పడిపోతోంది. తాజాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 7 శాతం క్షీణించి 158.1 టన్నులకు చేరుకుంది. ఇది క్రిందటేడాది కంటే 12.6 టన్నులు తక్కువ. అయితే, దేశంలో పుత్తడికి డిమాండ్ తగ్గడానికి అనేక కారణాలు చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. వీటి కారణంగానే ప్రజలు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదంటున్నారు.
మరి బంగారానికి డిమాండ్ తగ్గడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
దేశీయ మార్కెట్‌లో అత్యధిక ధరలు నమోదవడం కారణంగానే ప్రజలు బంగారం కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అతి స్వల్ప వ్యవధిలోనే పసిడి ధర 10 గ్రాములకు రూ. 64,000 గరిష్ట స్థాయికి చేరుకోవడం జనాలను కంగారుపెట్టింది. ఫలితంగా పుత్తడికి డిమాండ్ తగ్గింది. ఇక మొత్తం బంగారం డిమాండ్‌లో.. ఆభరణాల డిమాండ్ ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో 8 శాతం క్షీణించి 128.6 టన్నులకు చేరుకుంది. గత సంవత్సరంతో ఇదే సమయానికి 140.3 టన్నులుగా ఉంది. అంటే 11.7 టన్నుల డిమాండ్ తగ్గిందన్నమాట.
ఇక నివేదిక ప్రకారం.. ప్రజలు 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. వీటి ధర కాస్త అనుకూలంగా ఉండటమే కారణమని గుర్తించారు. గోల్డ్ బార్స్, నాణేల డిమాండ్ కూడా 30.4 టన్నుల నుంచి 29.5 టన్నులకు స్వల్పంగా 3 శాతం క్షీణతను చూసింది.
అయితే, డిమాండ్ అలా ఉంటే.. దిగుమతులు మాత్రం పెరగడం ఇక్కడ విశేషం. 2023 రెండవ త్రైమాసికంలో బంగారం దిగుమతులు 16 శాతం పెరిగి 209 టన్నులకు చేరుకున్నాయి. బంగారానికి డిమాండ్ తగ్గడానికి పెరుగుతున్న ధరలే కారణం అయినప్పటికీ.. ఈ పెరుగుదల దేశ జీడీపీ పెరుగుదలకు దోహదపడుతుందని వాదన వినిపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.3 శాతం పెరుగుతుందనే అంచనాకు ఇది ఊతమిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..