- Telugu News Photo Gallery Budget Sunroof Cars: Budget Sunroof Cars Under 10 Lakh Rupees in India check the list here
Budget Sunroof Cars: రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకే ది బెస్ట్ సన్ రూఫ్ కార్స్.. వివరాలు మీకోసం..
కారులో సన్‌రూఫ్ అంటే ఒకప్పుడు లగ్జరీ ఫీచర్‌గా భావిస్తారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఆటోమొబైల్ కంపెనీలు సామాన్యులకు అందుబాటులో బడ్జెట్ వాహనాల్లోనూ ఈ ఫీచర్‌ను తీసుకువచ్చాయి. తద్వారా ఎక్కువ మంది కస్టమర్లు తమ కలను నెరవేర్చుకునే ఆస్కారం లభించింది. మరి సామాన్యులకు అందుబాటు ధరలో, సన్‌రూఫ్ ఫీచర్‌తో ఉన్న కార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 06, 2023 | 9:26 AM

ఈ లిస్ట్‌లో మొదటి పేరు టాటా ఆల్ట్రోజ్. ఇది ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వచ్చిన అత్యంత సరసమైన హ్యాచ్‌బ్యాక్ కారు. కంపెనీ తన XM (S) వేరియంట్‌లో సన్‌రూఫ్‌ను అందిస్తుంది. దీని ధర రూ.7.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

SUV హ్యుందాయ్ Xter. దీనిలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఇవ్వబడింది. SX వేరియంట్‌లో ఉంది. దీని ధర రూ.8 లక్షలు(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.

హ్యుందాయ్ i20, ఇందులో సన్‌రూఫ్ ఆప్షన్ ఉంది. రూ. 10 లక్షలలోపు హ్యుందాయ్ నుండి రెండవ కారు. ఇది ఆస్టా వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.9.01 లక్షలు ఎక్స్ షోరూమ్.

టాటా నెక్సాన్ సన్‌రూఫ్‌తో వచ్చే సెగ్మెంట్‌లో అత్యంత సరసమైన కారు. ఇందులో సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. Nexon XM (S) వేరియంట్‌ను రూ. 9.4 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు.

టాటా పంచ్‌ను ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో కూడా విడుదల చేసింది. టాటా పంచ్ ఐసిఎన్‌జిని రూ.9.68 లక్షలు(ఎక్స్ షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది.

భారతదేశంలో సన్‌రూఫ్‌తో మరో బడ్జెట్ కారు మహీంద్రా XUV300. కంపెనీ తన డబ్ల్యూ6 మోడల్‌లో సన్‌రూఫ్‌ను అందిస్తుంది. దీనిని రూ. 10 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు.





























