Balakrishna: పాన్ ఇండియా సినిమాతో రానున్న బాలయ్య.. దర్శకుడు ఎవరంటే..
ప్రస్తుతం ఈ పనిమీదే ఉన్నారు ఎన్బీకే. మరి బాలయ్య పాన్ ఇండియా ఎంట్రీ ఎప్పుడు..? దీనికి దర్శకుడెవరు..? నిజంగానే బాలయ్య అడుగు పెడితే రికార్డులు బద్ధలైపోతున్నాయి. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఫామ్‌లో ఉన్నారీయన. ఒకప్పుడు బాలయ్య సినిమాలకు లైఫ్ టైమ్ కలెక్షన్లు 30 కోట్లు రావడం కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు ఫస్ట్ డేనే 30 కోట్లు వసూలు చేస్తున్నాయి. ఇంత మార్కెట్ వచ్చిన తర్వాత పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వకుండా ఎలా ఉంటారు చెప్పండి..? దీనికోసమే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భగవంత్ కేసరితో బిజీగా ఉన్నారు బాలయ్య ఇప్పుడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
