- Telugu News Photo Gallery Cinema photos Star Heroes New Releases Aim For August, Will Tollywood Shine Once Again
ఆశలు రేపుతున్న ఆగస్ట్.. క్యూ కట్టిన స్టార్ హీరోల సినిమాలు..
ఆశలు రేపుతున్న ఆగస్ట్.. రాబోయే 30 రోజుల్లో ఇండస్ట్రీకి ఈ టైటిల్ బాగా సెట్ అవుతుందేమో..? ఎందుకంటే జూన్‌లో ఆదిపురుష్ వచ్చినా నిలబడలేదు.. జులై అంతా బేబీ తప్ప మరో సినిమా లేదు.. దాంతో ఆగస్ట్‌పైనే ఆశలన్నీ ఉన్నాయిప్పుడు. అర్జెంట్‌గా ఓ పెద్ద బ్లాక్‌బస్టర్ పడితే కానీ టాలీవుడ్‌కు టైమ్ టర్న్ అయ్యేలా కనిపించడం లేదు. మరి ఆ లోటు తీర్చే సినిమా ఏది..?
Updated on: Aug 05, 2023 | 1:57 PM

ఆశలు రేపుతున్న ఆగస్ట్.. రాబోయే 30 రోజుల్లో ఇండస్ట్రీకి ఈ టైటిల్ బాగా సెట్ అవుతుందేమో..? ఎందుకంటే జూన్‌లో ఆదిపురుష్ వచ్చినా నిలబడలేదు.. జులై అంతా బేబీ తప్ప మరో సినిమా లేదు.. దాంతో ఆగస్ట్‌పైనే ఆశలన్నీ ఉన్నాయిప్పుడు. అర్జెంట్‌గా ఓ పెద్ద బ్లాక్‌బస్టర్ పడితే కానీ టాలీవుడ్‌కు టైమ్ టర్న్ అయ్యేలా కనిపించడం లేదు. మరి ఆ లోటు తీర్చే సినిమా ఏది..?

ఆగస్ట్‌లో ఫస్ట్ వీకే క్రేజీ సినిమాలు హ్యాండిచ్చాయి. నిజానికి అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఆగస్ట్ 4న రావాల్సి ఉన్నా వాయిదా పడటంతో.. ఈ వారమంతా చిన్న సినిమాలే రానున్నాయి. ఆగస్ట్ రెండో వారం మాత్రం భారీ సినిమాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా 10న జైలర్‌తో రజినీ వస్తున్నారు. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని సూపర్ స్టార్‌కు జైలర్ అత్యంత కీలకంగా మారింది.

సూపర్ స్టార్ వచ్చిన మరుసటి రోజే మెగాస్టార్ వస్తున్నారు. ఆగస్ట్ 11న భోళా శంకర్‌తో బరిలోకి దిగుతున్నారు చిరు. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. చిరు వచ్చిన నెక్ట్స్ డేనే ఉస్తాద్ అంటూ వచ్చేస్తున్నారు సింహా. మంచి కంటెంట్‌తో హిట్ కొట్టాలనే కసితో వస్తున్నారు సింహా. ఆగస్ట్ 12న విడుదల కానుంది ఈ చిత్రం.

ఆగస్ట్ 18న వైష్ణవ్ తేజ్ ఆదికేశవ షెడ్యూల్ చేసారు కానీ వచ్చేది అనుమానమే. అదే రోజు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రానుంది. ఇక సంతోష్ శోభన్ ప్రేమ్ కుమార్, శ్రీకాంత్ అడ్డాల పెదకాపు 1, సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్, దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత ఆగస్ట్ 18నే రానున్నాయి.

25న గాండీవదారి అర్జున సినిమాతో వరుణ్ తేజ్, బెదురులంకతో కార్తికేయ వచ్చేస్తున్నారు. మొత్తానికి ఈ ఆగస్ట్ అంతా కోలాహలంగానే ఉంది. వీటిలో నిజమైన సందడి ఏ సినిమా తెస్తుందో చూడాలి.