- Telugu News Photo Gallery Cinema photos Akshay Kumar OMG 2 Trailer Released Gopichand Completed 22 Years In Tollywood
22 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న గోపిచంద్.. మనసులోని మాట బయటపెట్టిన జాన్వీ..
నటుడిగా ఇప్పుడు సాగుతున్న జీవితాన్ని తాను ప్లాన్ చేయలేదని అన్నారు హీరో సుశాంత్. కథలో కేరక్టర్ బావుంటే చాలనుకుని చేస్తున్నట్టు చెప్పారు. చిన్నప్పుడు చిరు పాటలకు డ్యాన్స్ చేసిన తాను, ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. సినీ కెరీర్‌లో 22 ఏళ్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు హీరో గోపీచంద్. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన సినిమాల మేకర్స్, సహ నటీనటులు, ఫ్యాన్స్ సహకారాన్ని మర్చిపోలేనని అన్నారు.
Updated on: Aug 05, 2023 | 1:41 PM

Sushanth: నటుడిగా ఇప్పుడు సాగుతున్న జీవితాన్ని తాను ప్లాన్ చేయలేదని అన్నారు హీరో సుశాంత్. కథలో కేరక్టర్ బావుంటే చాలనుకుని చేస్తున్నట్టు చెప్పారు. చిన్నప్పుడు చిరు పాటలకు డ్యాన్స్ చేసిన తాను, ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.

Gopichand: సినీ కెరీర్‌లో 22 ఏళ్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు హీరో గోపీచంద్. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన సినిమాల మేకర్స్, సహ నటీనటులు, ఫ్యాన్స్ సహకారాన్ని మర్చిపోలేనని అన్నారు.

Janhvi Kapoor: తనకు ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని ఉండేదని అన్నారు జాన్వీ కపూర్. ఏడాదిగా తాను కన్న కల ఇప్పుడు నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్, రణ్‌వీర్‌సింగ్, టైగర్‌ష్రాఫ్‌తోనూ పనిచేయాలని ఉందని అన్నారు.

omg2: అక్షయ్‌కుమార్ శివుడి పాత్రలో నటించిన omg2 ట్రైలర్ విడుదలైంది. గంగా నది ఏ దిశగా ప్రవహిస్తుందో నాకు చెప్పకు ... వంటి ఆసక్తికరమైన డైలాగులతో సాగుతుంది ట్రైలర్. హరహర మహదేవ్ అంటూ వినిపించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెప్పించింది. ఆగస్టు 11న విడుదల కానుంది omg2.

Kajol: మణిరత్నం సినిమాలో అవకాశం ఎలా మిస్ అయిందో వివరించారు బాలీవుడ్ నటి కాజోల్. 'కుచ్ కుచ్ హోతా హై' సినిమా కోసం మణి ఆఫర్‌ని వద్దనుకున్నట్టు చెప్పారు. రెండు సినిమాలకూ ఒకే కాల్షీట్ అడ్జస్ట్ చేయలేకపోయానన్నారు. మణి సినిమాను వదులుకోవద్దని పలువురు సలహా ఇచ్చారన్నారు. అయితే, ఇచ్చిన మాట మీద నిలబడటం ముఖ్యం అనిపించిందని చెప్పారు.




