AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hiccups: నిరంతరాయంగా ఎక్కిళ్లు వస్తున్నాయా? వెంటనే తగ్గాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

ఎంతసేపటికీ అవి ఆగవు. ఎక్కిళ్లు సాధారణమైనవే అయినప్పటికీ.. కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. తరచుగా రావడం వల్ల కష్టంగా అనిపిస్తుంటుంది. చాలా వరకు ఒకటి రెండు సార్లు వచ్చి తగ్గిపోతాయి. కానీ, ఎక్కువ సమయ వస్తే మాత్రం ఇబ్బంది తప్పదు. మరి ఈ వరుస ఎక్కిళ్లకు కారణం ఏంటి? అసలు ఎందుకు ఎక్కిళ్లు వస్తాయి? వీటిని ఆపడం ఎలా? ఇందుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలను ఇప్పుడు మనం..

Hiccups: నిరంతరాయంగా ఎక్కిళ్లు వస్తున్నాయా? వెంటనే తగ్గాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Hiccups
Shiva Prajapati
|

Updated on: Aug 05, 2023 | 9:35 AM

Share

చాలా మందికి అన్నం తినే సమయంలో ఎక్కిళ్లు వస్తుంటాయి. కొందరికి ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాయి. అయితే, కొందరికి మాత్రం ఎక్కిళ్లు నాన్‌స్టాప్‌గా వస్తుంటాయి. ఎంతసేపటికీ అవి ఆగవు. ఎక్కిళ్లు సాధారణమైనవే అయినప్పటికీ.. కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. తరచుగా రావడం వల్ల కష్టంగా అనిపిస్తుంటుంది. చాలా వరకు ఒకటి రెండు సార్లు వచ్చి తగ్గిపోతాయి. కానీ, ఎక్కువ సమయ వస్తే మాత్రం ఇబ్బంది తప్పదు. మరి ఈ వరుస ఎక్కిళ్లకు కారణం ఏంటి? అసలు ఎందుకు ఎక్కిళ్లు వస్తాయి? వీటిని ఆపడం ఎలా? ఇందుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎక్కిళ్ళు ఎందుకొస్తాయి..

ఉదరం నుంచి గుండె, ఊపిరితిత్తులను వేరు చేసే కండరం డయాఫ్రాగమ్. శ్వాస తీసుకునే సమయంలో ఈ కండరం కీలక పాత్ర పోషిస్తుంది. శ్వాసనాళం సంకోచించినప్పుడు మన ఊపిరితిత్తులలో గాలి కోసం ప్రత్యేక స్థలం ఏర్పడుతుంది. కొన్ని కారణాల వల్ల డయాఫ్రాగమ్ కండరాల సంకోచం బయటి నుండి మొదలవుతుంది. ఈ కారణంగా వ్యక్తులకు ఎక్కిళ్లు మొదలవుతాయి.

ఎక్కిళ్లు రావడానికి ప్రధాన కారణం?..

చాలా మంది ఎక్కిళ్లు కామన్ అనుకుంటారు. నోరు ఎండిపోవడం, ఆహారం తీసుకోకపోవడం, ఇతర కారణాల వల్ల ఎక్కిళ్లు వస్తాయని అనుకుంటారు. ఇవి సాధారణమైనవి. వస్తాయ్.. అవే తగ్గుతాయి. అయితే, కొందరికి మాత్రం నాన్‌స్టాప్‌గా ఎక్కిళ్లు వస్తాయి. వరుస ఎక్కిళ్ల కారణంగా ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అసలు ఈ ఎక్కిళ్లు వచ్చేందుకు కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎక్కిళ్లు ఎప్పుడు, ఎలా వస్తాయి..

1. అధిక మద్యపానం, ధూమపానం చేయడం వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.

2. వ్యక్తి నీరసంగా ఉన్నప్పుడు కూడా ఎక్కిళ్లు వస్తాయి.

4. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కిళ్లు వస్తాయి.

5. కొన్నిసార్లు అతిగా ఉత్సాహంగా ఉన్నప్పుడు ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉంది.

6. గాలి ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా కూడా ఎక్కిళ్లు వస్తాయి.

7. నమలకుండా తినడం వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.

8. మసాలా ఎక్కువగా తినడం వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.

9. జీర్ణక్రియ సరిగా జరుగకపోవడం వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.

ఎక్కిళ్లు ఆపడానికి హోం రెమెడీస్..

1. ఎక్కిళ్లు ఆగడానికి గోరు వెచ్చని నీరు తీసుకుని, అందులో కొన్ని పూదీనా ఆకులు, నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలపాలి. ఈ నీటిని తాగడం వలన ఎక్కిళ్లు తగ్గుతాయి.

2. చిటికెడు ఇంగువ పొడి తీసుకుని అర టీస్పూన్ వెన్నతో కలిపి తినాలి. ఇలా తినడం ద్వారా ఎక్కిళ్లు తగ్గుతాయి.

3. శొంఠి, కరక్కాయ పొడిని మిక్స్ చేసి.. ఒక చెంచా పొడిని నీటితో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

4. ఎక్కిళ్లు ఎక్కువగా ఉంటే.. నిమ్మకాయ ముక్కను వాసన పీల్చుకోవాలి. ఇది వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.

5. ఎక్కిళ్లను ఆపడంలో ఏలకుల నీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. 2 ఏలకులను నీటిలో మరిగించి, ఆ నీటిని తాగాలి.

6. తేనె కూడా ఎక్కిళ్లను తగ్గిస్తాయి.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏమైనా తీవ్ర సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..